కెసిఆర్ హయంలో రైతే రాజు

lashmareddy-image

పెట్టుబడి సహాయంతో పాటు బీమా..
ప్రతి మండలానికి గోదాం ఏర్పాటు చేస్తాం
బాలానగర్‌లో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు
గులాబీ మయమైన బాలానగర్

మన తెలంగాణ/బాలానగర్ : రైతే రాజు అన్న పదానికి గతంలో ఏ ప్రభుత్వాలు న్యాయం చేయలేదని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతే రాజు అన్న నినాదానికి నూటికి నూరుపాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ రైతును రాజు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ మండల కేం ద్రం శివారులోని పెద్దాయపల్లి గేట్ వద్ద 5వేల మెట్రిక్ టన్నుల కేపాసిటి కలిగిన గోదాంను 3 కోట్ల నాబార్డు నిధులతో ఏర్పాటు చేసిన గోదాంను మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సిఎం కేసిఆఱ్ రైతు బంధు పథకంలో భాగం గా ఎకరానికి నాలుగువేలు, సంవత్సరానికి 8వేలు అందించే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టి రైతులకు మేలు చేశారన్నారు. రైతు బంధు, భీమా పథ కం పేద రైతుల కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని సైతం అందిస్తుందన్నారు. కేసిఆర్ రైతన్నలకు పెద్దన్నలాగా అన్ని సం క్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నారని వివరించారు. రైతు స్వయం సమృద్దికోసం రైతు సేవా సమితులను ఏర్పాటు చేసి సంఘటితం చేశారని అన్నా రు. మార్కెట్ యార్డులు, గోదాంలను ప్రతి మండలానికి నిర్మించే విధంగా చర్య లు చేపడుతున్నట్లు వివరించారు. రాజాపూర్, బాలానగర్ మండలాల్లో మార్కెట్ యార్డులు, గోదాంలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కులను అందించారు. 45వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మండల పరిధిలోని పెద్దాయపల్లి వద్ద, 44వ జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

భారీగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరికలు..
మండల పరిధిలోని గుడిబండ తాండాలో టిఆర్‌ఎస్ పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించిన అనంతరం తాండాలో అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన వారు చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువాలతో మంత్రి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసిఆర్, జడ్చర్ల నియోజక వర్గంలో మంత్రి లకా్ష్మరెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కోన్నారు. అభివృద్ధి చేసే నాయకులను ప్రజలు గుర్తిస్తారని, ప్రస్తుతం టిఆర్‌ఎస్ పార్టీలో చేరికలు చూస్తుంటే తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీకి తిరిగులేనట్లేనని వివరించారు. వచ్చే 2019, స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీను భారి మెజారిటితో గెలిపించుకోవాల్సిన భాద్యత ప్రజలదేనన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో బాదేపల్లి మార్కెట్ కమిటి చైర్మెన్ శోభాగోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మెన్ శ్రీశైలం యాదవ్, ఎంపిపి భాగ్యమ్మ, జడ్పిటిసి పట్ల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపిపి లింగు నాయక్, తహశీల్దార్ రాంబాయి, టిఆర్‌ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి వాల్య నాయక్, జరుప్ల లక్ష్మణ్ నాయక్, మెడికల్ సుందర్, ఎఎంసి డైరెక్టర్ వెంకట్ నాయక్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గోపాల్ రెడ్డి, నాయకులు వెంకటాచారి, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ యాదవ్ తదితరులున్నారు.