కెసిఆర్ పనితీరు భేష్

Union Minister Ramdas Athawale Praises CM KCR

కామారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరు అద్భుతంగా ఉన్నదని, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకూ ఉపయోగపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వ సామాజిక, న్యాయ శాఖమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు సహాయ పరికరాలను అందించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సిఎం కెసిఆర్ ఎన్నో కష్టనష్టాలకోర్చి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణను సాధించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తాము కూడా మద్దతు పలికామని అథవాలే గుర్తుచేశారు. దివ్యాంగులకు ఉద్యోగాల్లో తప్పనిసరిగా 4% రిజర్వేషన్లు పాటించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమంకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ఉచిత కోచింగ్, సబ్సిడి వాహనాలను త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, ఫుడ్ కమిటి చైర్మన్ తిర్మల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రె తదితరులు పాల్గొన్నారు.

Comments

comments