కెసిఆర్ ను గద్దే దించడమే తమ లక్ష్యం: కోదండరామ్

TJAC Kodandaram Fires At CM KCR And TRS Government

హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేసి కెసిఆర్ తన చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నారుని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ ఎద్దేవ చేశారు.  మంచి పాలన చేసే అందించే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయరని ఆయన అన్నారు. ప్రజల ఆక్షాంక్షలను నేరవేర్చటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అసమర్థ పాలనను అంతమొదించేందుకు జన సమితి బయలు దేరుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ ను గద్దే దించడమే తమ లక్ష్యమని కోదండరామ్ అన్నారు.  ఆపద్ధర్మ పదువులు వదిలి ప్రజాక్షేత్రంలోకి రావాలని కెసిఆర్‌కు కోదండరామ్ సవాల్‌ విసిరారు. కెసిఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించడం సరైంది కాదని, గవర్నర్‌ను కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలగించాలని ,రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు