కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన కేరళ సిఎం

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో వరదల దృష్ట్యా చేసిన సహాయానికి కెసిఆర్‌కు విజయన్ ధన్యవాదాలు తెలిపారు. కేరళకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు ఇతరత్రా సాయం చేసిన సంగతి తెలిసిందే. కెసిఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ సర్కార్ ప్రకటించిన రూ.25 కోట్ల రూపాయల చెక్కును ఆదివారం తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి త్రివేండ్రం వెళ్లి పినరాయి విజయన్‌కు అందజేశారు. చిన్నపిల్లల కోసం […]

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో వరదల దృష్ట్యా చేసిన సహాయానికి కెసిఆర్‌కు విజయన్ ధన్యవాదాలు తెలిపారు. కేరళకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు ఇతరత్రా సాయం చేసిన సంగతి తెలిసిందే. కెసిఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ సర్కార్ ప్రకటించిన రూ.25 కోట్ల రూపాయల చెక్కును ఆదివారం తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి త్రివేండ్రం వెళ్లి పినరాయి విజయన్‌కు అందజేశారు. చిన్నపిల్లల కోసం శనివారం వంద టన్నుల పౌష్టికాహారాన్ని ప్రభుత్వం పంపించింది. ఆదివారం పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం రెండున్నర కోట్ల విలువైన 50 ఆర్ వొ ప్లాంట్లను, 20 టన్నుల పాలపొడిని రక్షణశాఖ విమానంలో కేరళకు పంపించింది.

Related Stories: