కెటిఆర్ సార్ ఆదుకోండి…. !

In the social media on Twitter, KTR referenced this topic

మన తెలంగాణ/హైదరాబాద్ : బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతన్న  ఓ యువకుడు తనను  ఆదుకోవాల్సిందిగా మంత్రి కెటిఆర్ ను వేడుకున్నారు. జనగాం జిల్లా, రామన్నగూడెం రఘునాథ్‌పల్లి మండలానికి చెందిన సోమేశ్వర్ (21)అనే వ్యక్తి కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యం కోసం ఆతనని  హైదరాబాద్‌లో నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అ యితే ఈ వైద్యానికి  ఐదు లక్షల  రూపాయ ల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో సోమేశ్వర్ తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. అంత  చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ ఊరిలోని వారంతా తమ వంతు సాయంగా  ఐదువందలు  చొప్పున వేసుకుని రూ. 50వేలు పోగు చేసి ఇచ్చారు.  మిగతా మొత్తాన్ని ఎలా సేకరించాలో తెలియక సోమేశ్వర్ తల్లిదండ్రు లు  అవస్థలు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో  ఉన్న వారికి అండగా ఉంటున్న మంత్రి కెటిఆర్ గుర్తుకువచ్చింది. వెంటనే తన వైద్యానికి కావాల్సిన ఆర్థ్ధిక  చేయాల్సిందిగా కోరుతూ  మంత్రి కెటిఆర్‌కు, సోమేశ్వర్ ట్వీట్ చేశారు. కాగా సోమేశ్వర్ త ల్లిదండ్రులైన రామిరెడ్డి, సుశీలమ్మలు  కావడంతో వారు ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారు. కెటిఆర్ వెంటనే స్పందించి సిఎం సహాయ నిధి నుంచి ఆ మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా వేడుకున్నారు.

Comments

comments