కెటిఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం…

 International invitation to Minister KTR

హైదరాబాద్:  తమ దేశంలో పర్యటించాలని మంత్రి కెటిఆర్ కు యునైటెడ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్‌కు యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ లేఖ రాశారు. తెలంగాణలో పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అతిథ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి అరబ్ ఎమిరేట్స్ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తన దృష్టికి తీసుకొచ్చిన పలు కీలకమైన అంశాల్లో తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని  ఆయన హామీ ఇచ్చారు.