కెటిఆర్‌తో ప్రకాశ్‌రాజ్ భేటీ

Actor Prakash Raj  met Telangana IT Minister K T Rama Rao

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌తో సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి అంశంపై ప్రకాశ్‌రాజ్ కెటిఆర్ తో చర్చలు జరిపారు. ఆ గ్రామాన్ని ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామానికి కేటాయించిన అభివృద్ధి పనులు, తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టు ప్రకాశ్‌రాజ్ చెప్పారు. కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడానికి కలిసి పనిచేద్దామని కెటిఆర్ తెలిపినట్టుగా ఆయన  పేర్కొన్నారు.