కృష్ణాష్టమి ప్రత్యేక గీతం మీకోసం…

Krishnastami-Special-Song

ఎన్ని ఒడిదుడికులెదురైనా జీవితాన్ని ఒకే విధంగా తీసుకోవాలని చెప్పేది కృష్ణతత్వం. బాలగోపాలుడిగా వెన్న దొంగిలించినా, నా అనుకున్నవారిని తన చిటికెనవేలు ఆసరాగా గోవర్ధనగిరి ఎత్తి ఆదుకున్నాడు బాలకృష్ణుడు. బృందావనమాలిగా మురళీగానలోలునిగా పదహారువేలమంది గోపికలను ఆకర్షించి, రాసకేళితో మురిపించడం ఆ చిలిపి కృష్ణునికే చెల్లింది. నరునికి రథసారథ్యం వహించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన వాడు కృష్ణుడు.

చేయాల్సిన పనిని చేసి ఫలితాన్ని నాకు వదలమని ధీమాగా చెప్పిన కృష్ణుని చేయూతను ఆలంబనగా అందుకోనిదెవరు? మానవజాతికి గుణపాఠాలు నేర్పినందుకే దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరు భక్తిపూర్వకంగా కృష్ణుడిని అని ఆరాధిస్తున్నారు. కృష్షాష్టమి రోజున చిన్న పిల్లలకు కృష్ణుని వేషం వేయించి తల్లిదండ్రులు ముచ్చటతీర్చుకుంటారు. కృష్ణాష్టమి రోజున కొన్ని పాఠశాలలు విద్యార్థులకు కృష్ణుని వేషం వేసి నాటకాలు వేయిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా స్కై టివి వెబ్ తెలుగు ఛానల్ ఓ పాటను విడుదల చేసింది. ఈ పాటను మధు ప్రియ పాడింది.

 

Courtesy by  SKY TV

Comments

comments