కృత్రిమ చెట్టు కోసం పాతిక లక్షలు!

NTR

దర్శకుడు త్రివిక్రమ్ ఏది చేసినా గ్రాండ్‌గా ఉంటుంది అన్నమాట నిజమే. తన సినిమాల బడ్జెట్ విషయంలో అతను ఏమాత్రం రాజీపడడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత…’ కోసం ఇదే ఫార్ములాను అతను అనుసరిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఓ సీన్‌లో బాగా ఆకులు పండిన ఓ చెట్టు కావాల్సి వస్తే త్రివిక్రమ్ కోరుకున్నట్టు నిజమైన చెట్టు ఎక్కడా కనిపించలేదట. ఇంకా వెతికితే సమయం వృథా అనుకొని త్రివిక్రమ్ వెంటనే చెన్నై నుంచి ప్లాస్టిక్ ఆకులను తెప్పించి కృత్రిమంగా చెట్టును ఆర్ట్ డైరెక్టర్‌తో చేయించాడట.  చెన్నై నుంచి తెప్పించిన ఆ ఆకుల ఖరీదు అక్షరాల పాతిక లక్షలట. ఆకులు నిండిన చెట్లతో పాటు వాడిపోయిన చెట్లను కూడా లొకేషన్‌లో సెట్ చేశారట. అయితే గాలి వానకు ఓసారి అన్ని ఆకులు పడిపోతే మళ్లీ వాటిని అతికించేందుకు సినిమా టీమ్ ఎంతో కష్టపడిందట. ఇక అక్టోబర్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ సినిమా టీజర్ మాత్రమే వచ్చింది. ఇక ‘జై లవకుశ’ తర్వాత ఏడాది గ్యాప్‌తో  ఎన్టీఆర్ ‘అరవింద సమేత’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.