కూలిన మిగ్ -27

MiG-27 Collapsed at Rajasthan

రాజస్థాన్ : భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -27 యుద్ధ విమానం మంగళవారం ఉదయం రాజస్థాన్‌లో కూలింది. జోద్‌పూర్‌లో ఆ విమాన శిథిలాలను కనుగొన్నారు. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ యుద్ధ విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు చాలా యుద్ధ విమానాలు కుప్పకూలిన విషయం తెలిసిందే. రష్యా నుంచి తీసుకొచ్చిన మిగ్‌లు సరిగా పని చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇకపై రష్యా నుంచి ఎటువంటి యుద్ధ విమానాలు కొనుగోలు చేయవద్దన్న అభిప్రాయం వైమానిక దళ అధికారుల నుంచి వినిపిస్తోంది. రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను కొనాలనే ఆలోచనను విరమించుకోవాలన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments