కులాంతర ప్రేమ వివాహం

Once again, prove that the caste is not interrupted to love

నవాబ్‌పేట్‌: ప్రేమించడానికి కులాలు అడ్డురావని మరోసారి ఓ జంట రుజువు చేసింది. పెద్దలు ఒప్పుకోరని తెలిసి స్థానిక యువకులు, నాయకుల సమక్షంలో శివ పార్వతుల సాక్షిగా పెళ్లి అనే బంధంతో శాశ్వతంగా ఏకమైన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని హజిలాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థుడైన రాజు అనే యువకుడు మహబూబ్‌నగర్ పట్టణం, మున్నూరుకాపు కులానికి చెందిన అర్చన గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తీరా పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారం మండల కేంద్రంలోని పెద్ద శివాలయంలో పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. పెళ్లికి సహకరించిన యువకులు, స్థానిక నాయకులు గోపాల్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, కొల్లి నర్సింహా, రాము తదితరులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments