కురులతో కిర్రాక్ పుట్టిస్తున్న బుడ్డది..!(వీడియో)

టోక్యో: ఆ పాప వయసు ఏడంటే ఏడు నెలలు. కానీ కురులు చూస్తే మతి పోవాల్సిందే. ఆ జుట్టు ప్రత్యేకతతో ఈ జపానీస్ చిన్నారి సోషల్ మీడియాలో ఏకంగా 46 వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది. జపాన్ కు చెందిన చాంకో అనే పాప, తన అందమైన కురులతో ఫాలోవర్స్ ను కనువిందు చేస్తోంది. అయితే ఏడు నెలల చిన్నారికి ఇంత భారీగా జట్టు రావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా, పుట్టుకతోనే అధిక జట్టుతో పుట్టిన చాంకోకు… నెలలు […]

టోక్యో: ఆ పాప వయసు ఏడంటే ఏడు నెలలు. కానీ కురులు చూస్తే మతి పోవాల్సిందే. ఆ జుట్టు ప్రత్యేకతతో ఈ జపానీస్ చిన్నారి సోషల్ మీడియాలో ఏకంగా 46 వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది. జపాన్ కు చెందిన చాంకో అనే పాప, తన అందమైన కురులతో ఫాలోవర్స్ ను కనువిందు చేస్తోంది. అయితే ఏడు నెలల చిన్నారికి ఇంత భారీగా జట్టు రావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా, పుట్టుకతోనే అధిక జట్టుతో పుట్టిన చాంకోకు… నెలలు గడిచే కొద్దీ మరింత ఒత్తుగా కేశాలు రావడం మొదలైందని చిన్నారి తల్లి చెబుతోంది. గత సంవత్సరం డిసెంబర్ లో జన్మించిన చాంకో ఫొటోలను ఎప్పటికప్పుడు వాళ్లమ్మ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. దీంతో చిన్నారి ఫాలోవర్స్ రోజురోజుకు పెరుగుతున్నారు. కురులే కాదండోయ్.. ఈ బుడ్డది తన క్యూట్ లుక్స్ తో కూడా నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీంతో అమాంతం ఆమె అభిమానగణం పెరిగిపోతోంది.