కుప్పకూలిన సఫారీలు : భారత్ టార్గెట్ 192

De-Kock

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రీకా ఆటగాళ్లు కుప్పకూలిపోయారు. ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన సఫారీలు 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఓపెనర్లు డికాక్ (53), ఆమ్లా (35), డుప్లెసిస్ (36) మినహా మిగిలిన ఆటగాళ్లు అందరు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. తొలుత ఓపెనర్లు కాస్త నిలకడగా ాడినా మిడిలాడర్ ప్లేయర్స్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసింది. భారత్ బౌలింగ్ లో భవనేశ్వర్, బుమ్రా చెరి రెండు, అశ్విన్, పాండ్య, జడేజా చెరో వికెట్ తీశారు. 192 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.

Comments

comments