కుప్పకూలిన పురాతన వంతెన…

truck

జార్ఖండ్: పురాతన వంతెన ఒకటి కుప్పకూలిన ఘటన గిరిదిహ్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. బరాకర్ నదిపై ఉన్న పురాతన వంతెనపై నుంచి భారీ లారీ వెళుతుంది. ఈ సమయంలో ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో లారీ కాస్త నదిలో పడిపోయింది. డ్రైవర్ లారీపై ఉన్నట్టు గుర్తించిన స్థానికులు అతడిని కాపాడారు. గాయాలతో ఉన్న అతన్నిసమీప దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం సంభవించడంతో కుప్పకూలిన వంతెనపై వాహన రాకపోకలు నిషేధించి, దానికి ప్రత్యామ్నాయంగా కొత్త వంతెనను నిర్మించామని అధికారులు వెల్లడించారు. రవాణ శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా పాత బ్రిడ్జిపై నుంచి వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రవాణ శాఖ అధికారులు చెప్పారు.

Comments

comments