కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

Woman suicides with family Issues

పాపన్నపేట: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుంది. మండల పరిధిలోని రామతీర్థం గ్రామానికి చెందిన బొక్కల రేణుక(35) భర్త గురుమూర్తి. ఈమెకు ఇద్దరు కుమారులు.  ఎస్ఐ సందీప్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన రేణుక ఆత్మహత్య చేసుకుందని, మృతురాలు విషం సేవించిన వెంటనే భర్త, బంధువులు ఆసుపత్రికి తరలించారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.