కుక్కకు ముత్తాత నక్క

Fox-and-Dog

కుక్కల మాదిరిగా నక్కలు మనుషులతో మైత్రిని కొనసాగిస్తాయా గతంలో మనుషులు నక్కలను మచ్చిక చేసుకుని పెంచేవారా? అన్న ప్రశ్నలు ఎన్నో ఏళ్లుగా పరిశోధకుల మెదళ్లను దొలిచేస్తున్నాయి. అర్థ శతాబ్దం పైగా నక్కల స్వభావంపై అధ్యయనం సాగుతోంది. ఈ జంతువు మచ్చిక మూలాలు అర్థం కావడం లేదు. 1959లో రష్యా బయోలాజిస్టు డిమిట్రీ బెల్యాయెన్ మనుషులతో మచ్చిక కన్నా జన్యువులో కీలక పాత్ర వహిస్తాయని సిద్ధాంతీకరించారు. ఈ మేరకు తన సిద్ధాంతాన్ని రూఢి చేసుకోవడానికి పరిశోధనలు సాగించారు. జన్యువుల పాత్ర వల్లనే నక్కలు క్రమేణా ఉప తెగలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయని, ఆ ఉపతెగలకు చెందిన కుక్క మనిషిని చక్కని స్నేహతుడిగా మారిందని సిద్ధాంతీకరించారు. ఇదే సమయంలో నోబెల్ బహుమతి గ్రహీత కొన్రాడ్ లొరెంజ్ జంతువుల్లో , మనుషుల్లో క్రూరత్వాన్ని, దురాక్రమణకు అధ్యయనం చేస్తూ కొత్తగా పుట్టిన నక్క కూనలు సాధు స్వభావం కలిగి మనుషులతో మచ్చిక కలిగేలా ఉంటాయిని సిద్ధాంతీకరించారు.

రష్యాలో నక్కల పెంపకం కేంద్రాలు ఎక్కువ, ఇక్కడ వీటిపై ప్రయోగాలు చేయడానికి అవకాశం బాగా ఉంది. అయితే 16 ఏళ్లుగా జంతువులను అధ్యయనం చేస్తున్న బెనెటిస్టు కుకెరోవా- ఫార్మ్ -బ్రెడ్ నక్కలు మచ్చిగా ఉండవని చెప్పారు. మనం వాటిని తాకడానికి ప్రయత్నిస్తే అవి భయంతో క్రూరంగా ప్రవరిస్తాయని అన్నారు. అయితే రష్యా బయెలాజిస్టు బెల్యాయెన్ పెద్ద ఫార్మ్ ప్రయోగాలకు సహకరించడానికి ఒప్పుకోవడాన్ని గమనించారు. ఒక పద్ధతిలో నక్కల ఎంపిక ప్రారంభించారు. అవి ప్రజల పట్ల తక్కువ భయం ప్రదర్శించడాన్ని కనుగొన్నారు. ఈ విధానాన్ని ప్రతి కొత్త తరంలోనూ కొనసాగించారు. 10 తరాల తర్వాత కొన్ని నక్కల కూనలు కుక్కల వలె మచ్చికగా మనుషులను చూడగానే తోకలు ఊపడం గమనించారు. వాటికి ఆహారం లేకపోయినా మచ్చికగానే మెలిగాయి. మనుషులను చూడగానే ఆనందపడ్డాయి- అని ఆయన తన అనుభవాలను వివరించారు. ఈ రోజు సాధుస్వభావం గ్రూపులకు చెందిన 500 పెంపకం నక్కల జంటలు కాకపోయినా, కనిపించిందని అన్నారు. 1970 ప్రాంతంలో రష్యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ, జెనెటిక్స్‌కు చెందిన బెల్యయెక బృందం మూడు గ్రూపుల వారీగా నక్కలను విభజించి పరిశీలించారు. జన్యువులను చేర్చిన నక్కల గ్రూపు ఒకటికాగా, క్రూరత్వం గల నక్కల గ్రూపు ఇంకొకటి, అడవుల్లో ఉన్న నక్కల గ్రూపు మూడవదిగా విభజించారు. ఈ మూడు గ్రూపుల్లో ఒక్క గ్రూపు నుంచి 10 నక్కలను ఎంపిక చేసి వాటి జన్యుసరళిని క్రమబద్ధీకరించారు. వచ్చేతరం జన్యుక్రమబద్ధీకరణ టెక్నాలజీయే అభివృద్ధికి దారి చూపిస్తుందని పరిశోధకులు అభిప్రాయ పడ్డారు.

ఈసారి పరిశోధకులు 103 సంబంధించిన జన్యు రీజయన్లును గుర్తించారు. ప్రాధాన్యంగా 60 శాతం కన్నా ఎక్కువ సాధు జంతువులు నియంత్రం గ్రూపుతో సహా ఎస్ ఒ ఆర్ సి ఎస్ ఎల్’ లో అదే వైవిధ్యాన్ని ప్రదర్శించాయి. క్రూరమైన నక్కల్లో ఈ వైవిధ్యం లోపించింది. అందుకే పరిశోధకులు అన్నాకుకెకోవా ‘ఎస్ ఒఆర్ సి ఎస్ ఎల్’ జన్యువు గురించి మాట్లాడుతూ ఈ ప్రత్యేక జన్యువు ప్రభావం నక్కల్లో సాధు స్వభావాన్ని ఎక్కువగా పెంచుతుందని వివరించారు. వివిధ రకాల జన్యువులు చాలా నిర్ధిష్ట ప్రవర్తనకు కారణమ వుతుందని అన్నారు. ఉదాహరణకు నక్కలు తమ తోకను ఆడిస్తూ ప్రజలకు స్వాగతం పలుకుతు న్నాయంటే మనిషి నక్క కడుపును తాకి నిమిరే లా ప్రభావితం చేసే జన్యువులు కన్నా వివిధ రకాల జన్యువుల ప్రభావం మనిషితో మైత్రిని సుదీర్ఘ కాలం కొనసాగించాలని నక్క కోరుకుంది. మరో జన్యు సరళి సంకేతాల ప్రభావమే కారణమని తెలుసుకోక తప్పదని పరిశోధకలు వివరించారు.
మన తెలంగాణ , సైన్స్ విభాగం

Comments

comments