కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో…

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్‌టిఆర్’ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. టైటిల్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను ఆమె పోషిస్తోంది. బసవతారకం దృష్టి కోణం నుంచే ఈ సినిమా నేరేషన్ ఉంటుందని సమాచారం. ఇదిలాఉండగా ఈ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం  హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు దశాబ్దానికి పైగా ఎన్టీఆర్ నివసించిన అబిడ్స్‌లోని ఇంట్లో షూటింగ్ జరుగుతోందట. బంజారాహిల్స్ నివాసానికి మారకముందు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన […]

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్‌టిఆర్’ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. టైటిల్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను ఆమె పోషిస్తోంది. బసవతారకం దృష్టి కోణం నుంచే ఈ సినిమా నేరేషన్ ఉంటుందని సమాచారం. ఇదిలాఉండగా ఈ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం  హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు దశాబ్దానికి పైగా ఎన్టీఆర్ నివసించిన అబిడ్స్‌లోని ఇంట్లో షూటింగ్ జరుగుతోందట. బంజారాహిల్స్ నివాసానికి మారకముందు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాలంలో ఎన్టీఆర్ ఈ ఇంట్లోనే ఉండేవారట. బాలకృష్ణ, విద్యాబాలన్‌లపై ఈ ఇంట్లో కీలమైన ఎపిసోడ్స్‌ను ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఇంట్లో షూటింగ్ చేస్తున్న సమయంలో బాలయ్య కాస్య భావోద్వేగానికి గురయ్యాడు.

Comments

comments

Related Stories: