కివీస్ కు కొత్త కోచ్

Gary Stead named New Zealand Head Coach

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వచ్చారు. ఇప్పటి వరకు కోచ్ ఉన్న హెస్సన్‌ కాలపరిమితి ముగియడంతో ఆయన స్థానంలో గ్యారీ స్టీడ్ నియమితులయ్యారు. ఇక కోచ్ గా కివీస్ జట్టుపై తనదైన ముద్ర వేసిన మైక్ హెస్సన్స్ ను మరిపించేలా స్టీడ్ పనిచేస్తారని క్రీడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణం 2014, 2015, 2017ల్లో క్యాంటర్బరీ జట్టు దేశీయంగా విజేతగా నిలవడంతో కోచ్ గా గ్యారీ కీలక పాత్ర పోషించడమే. కాగా, 46ఏళ్ల స్టీడ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌ను ఆరంభించారు. 1999కి ముందు కేవలం అయిదు టెస్టు మ్యాచ్‌లను మాత్రమే స్టీడ్‌ ఆడారు. తనపై నమ్మకం ఉంచి కోచ్ నియమించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఈ సందర్భంగా స్టీడ్ ధన్యవాదాలు తెలిపారు. కివీస్ జట్టును మరింతా బలమైన జట్టుగా తయారు చేయడానికి కృషి చేస్తానన్నారు.

Comments

comments