కాళ్యేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్త్ సిద్ధం

Electricity is prepared for Kaleshwaram project

నాలుగు నెలల ముందే గోలివాడ విద్యుత్ ఉపకేంద్రం పూర్తి

మనతెలంగాణ/కరీంనగర్‌ : కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న కన్నెపల్లి, అన్నారం,గోలివాడ పంప్‌హౌస్‌లకు విద్యుత్ సరఫరా చేయడం కోసం పెద్దపల్లి జిల్లా పాలకుర్తిమండలంగోలివాడలో నిర్మించిన 400/200/ 11కెవి విద్యుత సబ్‌స్టేషన్ నిర్మాణం పూరైయింది. నిర్దేశించిన గడువుకు నాలుగు నెలల ము ందే ఈ సబ్ స్టేషన్ పనులు పూర్తికావడం విశేషంగాచెప్పుకోవచ్చు.పంప్ హౌ స్‌లకు విద్యుత్ సరఫరా చేసే ప్రక్రియ మొత్తం పూ ర్తయింద ని,400/ 200/11 కెవి విద్యుత్ ఉపకేంద్రాన్ని కమిషన్ చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు,ట్రాన్స్‌కో అధికారులు, వర్కింగ్ ఏజెన్సీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.పంప్‌హౌజ్‌ల కు త్వరలోనే విద్యుత్ సరఫరా చేసి వాటిని నడిపించనున్నట్లు తెలిపా రు. కాళేశ్వరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలనే లక్షంతో ప్ర భు త్వం పనిచేస్తుండగా అందుకు దన్నుగా నిలిచే గోలివాడ సబ్‌స్టేషన్ పూర్తి కావడం ఈ ప్రాజెక్టులో కీలక మలుపుగా భావించవచ్చు.గోలివాడ సబ్‌స్టేషన్ ద్వారా వేయ్యి మెగావాట్లకు పైగా విద్యుత్‌ను అవకా శం ఉంది.రీచార్జ్ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇక్కడి నుం చి మూడు పంప్‌హౌస్‌లకు విద్యుత్ సరఫరా చేయడానికి స్వరం సి ద్ధంగాఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాళేశ్వరం ప్రా జెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ కోసం మొత్తం 19 సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కమిషన్ అయిన గోలివాడ విద్యుత్ ఉపకేంద్రం నుండి సుందిళ్ల పంప్‌హౌస్‌కు 9×40 మెగావాట్లు, అన్నారంకు 8×40 మెగావాట్లు, మేడిగడ్డకు 11×40 మెగావాట్ల వి ద్యుత్ సరఫరా కానున్నది. గోలివాడ సబ్‌స్టేషన్ కమిషన్ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి ప్రభాకర్‌రావు, కరీంనగర్ జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ సూపరింటెండె ంట్ ఇంజనీర్లు నాగరాజు, సరస్వతి, సివిల్ ఎస్‌ఇ బ్రహ్మారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్, సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి. రఘునందన్, చందులాల్ పాల్గొన్నారు.

Comments

comments