కాళేశ్వరం 7వ ప్యాకేజిలో ప్రమాదం..ఒకరి మృతి

One Person Killed At Kaleshwaram 7th package

ధర్మారం : మండలంలోని  మల్లాపూర్ శివార్‌లోని కాళేశ్వరం ఎడవ ప్యాకేజి లో మంగళవారం నాడు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. సంఘటనకు సంబంధించిన వివరాలలు ఇలా ఉన్నాయి.. అస్సాం రాష్ట్రానికి చెందిన నెగోని నర్జరి (25) ప్యాకేజి 7 భూగర్భ టన్నెల్‌లో కాంక్రిట్ మిక్చర్ అన్‌లోడ్ చేసి లారీ ట్యాప్ విప్పి చేతులు కడుక్కుంటుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వెనుకకు నడపడంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి శవాన్ని అస్సాం తరలించారు. ధర్మారం పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments