కాలేజీ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న సంజూ

Sanju Samson To Marry College Friend Charu

తిరువనంతపురం: కేరళకు చెందిన భారత యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కాలేజీ ప్రెండ్ అయినా చారుతో శాంసన్ వివాహం డిసెంబర్ 22న జరుగనుంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని సంజూ తన అభిమానులతో పంచుకున్నాడు. 23 ఏళ్ల సంజూ తన కాలేజీ క్లాస్‌మేట్‌ అయిన చారును ఐదేళ్లక్రితం కలిశాడు. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, ఈ విషయం ఎప్పుడూ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే, తమ ప్రేమకు ఇప్పుడు పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో తన పెళ్లి విషయాన్ని సంజూ వెల్లడించాడు. తాము గత ఐదేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఎప్పుడూ బయటపడలేదని, ఇవాళ మా పెళ్లికి పెద్దల నుంచి అంగీకారం లభించడం చాలా ఆనందంగా ఉంది. మా పెళ్లిని సంతోషంగా ఒప్పుకున్న తల్లిదండ్రులకు చాలా కృతజ్నతలు. చారు వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లిని కుదిర్చారు. మా పెళ్లికి డిసెంబర్‌ 22న తేదీన ముహూర్తం కుదిరింది‌’ అంటూ సంజూ తెలిపాడు. ఇక మంచి బ్యాట్స్ మెన్ అండ్ వికెట్ కీపర్ అయినా శాంసన్ ఇండియా తరఫున టీ20ల్లో 2015, జూలై 19న జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఐపిఎల్ లో 1000 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా సంజూ రికార్డు సృష్టించాడు. అంతేగాక రంజీల్లో అతి చిన్న వయసులో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న క్రికెటర్ గా శాంసన్ రికార్డుకెక్కాడు.

Comments

comments