కాలిఫోర్నియాలో అకాళీదళ్ నేతపై దాడి

Attack on Akali Dal Leader in California

కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు, అకాళీదళ్ నేత మంజిత్ సింగ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. యుబి సిటీలోని గురుద్వారలో ఉన్న ఆయన్ను కొందరు బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. దాడిలో భాగంగా ఆయన ముఖానికి నల్లరంగు పూశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసినట్టు కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. దాడికి తీసిన కారణాలు తెలియరాలేదని వారు పేర్కొన్నారు. సుమారు 30 మంది తనపై దాడి చేశారని మంజిత్ సింగ్ తెలపారు. గురుద్వారా నిబంధనలను అనుసరించి వారిని తాను ఏమీ అనలేకపోయానని ఆయన పేర్కొన్నారు.

Attack on Akali Dal Leader in California

Comments

comments