కాలం గిర్రున తిరిగింది

పదిహేనేళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’లో నాగ్‌కి కీలకమైన  పాత్ర దక్కింది. ఇందులో అమితాబ్ బచ్చన్, రణబీర్, అలియాభట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని నాగార్జున స్వయంగా చెప్పాడు. “చాలా రోజుల తర్వాత హిందీ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉంది. కొత్తదనంతో కూడిన విభిన్న కథా చిత్రమిది”అని నాగ్ పేర్కొన్నాడు. గతంలో ఆయన శివ, క్రిమినల్, ఖుదాగవా, అంగారి, […]

పదిహేనేళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’లో నాగ్‌కి కీలకమైన  పాత్ర దక్కింది. ఇందులో అమితాబ్ బచ్చన్, రణబీర్, అలియాభట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని నాగార్జున స్వయంగా చెప్పాడు. “చాలా రోజుల తర్వాత హిందీ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉంది. కొత్తదనంతో కూడిన విభిన్న కథా చిత్రమిది”అని నాగ్ పేర్కొన్నాడు. గతంలో ఆయన శివ, క్రిమినల్, ఖుదాగవా, అంగారి, జక్మ్ తదితర చిత్రాల్లో నటించాడు. అయితే పదిహేనేళ్ల క్రితం ‘ఎల్‌ఓసి’ చిత్రంలో నటించగా… అందులో నాగ్‌ది చిన్న పాత్ర. అయితే తనకు ‘జక్మ్’లో నటించిన  రోజులు ఇంకా గుర్తున్నాయని చెప్పాడు నాగార్జున. మహేష్‌భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెట్‌లోకి భట్ చిన్న కూతురైన అలియాభట్ వచ్చేదని తెలిపాడు. అప్పట్లో అలియా చాలా చిన్న పిల్ల అని గుర్తుచేసుకున్నాడు. కాలం గిర్రున తిరిగిందని… ఇప్పుడు అలియాభట్‌తో నేను నటిస్తున్నానని చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’లో తాను చేయబోతున్న పాత్ర ఏమిటనేది మాత్రం ఆయన బయటపెట్టలేదు. అయితే ఈ పాత్ర తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటంతోనే ఆ అవకాశం నాకు వచ్చి ఉంటుందని భావిస్తున్నానని నాగార్జున పేర్కొన్నాడు.

Related Stories: