కార్మికుల సమస్యలను పరిష్కరించాలి…

బచ్చన్నపేట : గత 13 రోజులుగా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక దీక్షలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని పంచాయతీ ఉద్యోగుల కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి అన్వర్, టేకులపల్లి రాజు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అర్హులైన కారోబార్లను పంచాయతీ కార్యదర్శులుగా అవకాశం కల్పించాలని, పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు ప్రమాద […]

బచ్చన్నపేట : గత 13 రోజులుగా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక దీక్షలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని పంచాయతీ ఉద్యోగుల కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి అన్వర్, టేకులపల్లి రాజు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అర్హులైన కారోబార్లను పంచాయతీ కార్యదర్శులుగా అవకాశం కల్పించాలని, పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు ప్రమాద బీమా, కనీస ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాల్‌రెడ్డి, రాజిరెడ్డి, అశోక్, నర్సయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: