కార్మికులకు అండగా అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగాలకు ఆసరాగా పథకం 60 ఏళ్లు నిండిన కార్మికులకు పెన్షన్ 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వారందరికీ అవకాశం మన తెలంగాణ/వనపర్తి : అసంఘటిత కార్మికులకు అటల్ పెన్షన్ యోజ న పథకం ఆసరాగా నిలువనుంది. రెక్కాడితే గాని డొక్క నిండని బతుకులకు శేష జీవితంలో ఆర్థిక వెసలుబాటునిస్తోంది. విశ్రాంత ఉద్యోగుల తరహాలోనే అసంఘటిత రం గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకు ద్వారా అట ల్ […]

అసంఘటిత రంగాలకు ఆసరాగా పథకం
60 ఏళ్లు నిండిన కార్మికులకు పెన్షన్
18 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వారందరికీ అవకాశం

మన తెలంగాణ/వనపర్తి : అసంఘటిత కార్మికులకు అటల్ పెన్షన్ యోజ న పథకం ఆసరాగా నిలువనుంది. రెక్కాడితే గాని డొక్క నిండని బతుకులకు శేష జీవితంలో ఆర్థిక వెసలుబాటునిస్తోంది. విశ్రాంత ఉద్యోగుల తరహాలోనే అసంఘటిత రం గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకు ద్వారా అట ల్ పెన్షన్ యోజనా పథకాన్ని ప్రవేశపెట్టింది. 2015న అమలులోకి తెచ్చింది. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ తపాలా కార్యాలయాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. యుక్త వయస్సులో ఉన్న యువతకు పొదుపుపై అవగాహన కల్పించి శేష జీవితంలో వారి ఆర్థిక వెసలుబాటు కలిగేలా ఈ పథకం దోహదపడుతుంది. బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వా త మాజీ ప్రధాని వాజ్‌పాయ్ పేరుతో అటల్ పెన్షన్ యోజనా పథకాన్ని 2015 సంవత్సరం జూన్ 1 ప్రారంభించి 2020 మే 31 వరకు ఈ పథకంలో చేరడానికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సున్న వారికి ఈ అవకాశాన్ని కల్పించింది. అనంతరం 60 ఏళ్లు నిండిన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ సౌకర్యం వచ్చేలా ఈ పథకం అవకాశం కల్పించింది. నెలకు రూ.1000 నుండి రూ.5 వేల పెన్షన్‌ను కల్పించింది.

అటల్ పెన్షన్ యోజన పథకం ప్రీమియం వివరాలు
అటల్ పెన్షన్ యోజనా పథకంలో చేరిన లబ్ధిదారుడికి నెలకు రూ.వెయ్యి వంతున పెన్షన్ తీసుకోవాలంటే అతను నెలవారిగా చెల్లించాల్సిన సొమ్ము వివరాలు ..
18 సంవత్సరాల నిండిన వారు నెలకు రూ.42
20 సంవత్సరాలు నిండిన వారు నెలకు రూ.50
25 సంవత్సరాలు నిండిన వారు నెలకు రూ.76
30 సంవత్సరాలు నిండిన వారు నెలకు రూ.116
35 సంవత్సరాలు నిండిన వారు నెలకు రూ.181
40 సంవత్సరాలు నిండిన వారు నెలకు రూ. 291
చెల్లించాల్సి ఉంది. రూ. 5వేల స్కీంలో చేరే లబ్ధిదారుడు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండి 42 సంవత్సరాలు ప్రీమియం కట్టినట్లయితే అతనికి 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ పథకంలో చేరేవారికి నామిని సౌకర్యం ఉంది. ప్రతి ఖాతాదారుడు ఒక పెన్షన్ ఖాతాను మాత్రమే ప్రారంభించాలి. పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకునేందుకు లేదా పెంచుకునేందుకు వీలుంది. ఈ అవకాశం సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఉంటుంది.

అటల్ పెన్షన్ యోజన పథకానికి అర్హులు
18 నుండి 40 సంవత్సరాల లోపు వారు సభ్యులుగా చేరవచ్చు. యువతీ యువకులు ఎవరైనా ఈ పథకం లో చేరే వెసులు బాటు. ఏ బ్యాంకులోనైనా పొదుపు ఖాతా ఉం డాలి. లేకుంటే పొదుపు ఖాతాను నూతనంగా ప్రారంభించాలి. సభ్యుడు తన మొబైల్ నెంబర్ వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి. ఈ పథకంలో చేరడానికి 2020 మే 31 వరకు గడువు ఉంది. ఆదాయం పన్ను పరిధిలోకి రాని వారికి కేంద్ర ప్రభుత్వం. తన వాటాగా ఖాతాదారుడు ఈ స్కీంలో సంవత్సరానికి చెల్లించే డబ్బులో 50 శాతం లేదా రూ.1000 ఏది తక్కువ అయితే దానిని భరిస్తుంది.

Related Stories: