కార్పొరేట్ ఫలితాలే కీలకం

 అంతర్జాతీయ అంశాలపైనా దృష్టి పెట్టాలి: విశ్లేషకులు ముంబై: ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ పరిణామాలపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గతవారం ఐటి దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు తొలి త్రైమాసికం ఫలితాలను వెల్లడించాయి. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్‌ఇండ్ సైతం పనితీరు వెల్లడించింది. ఇదే బాట లో ఈ వారం మరికొన్ని పెద్ద సంస్థలు క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్నాయి. వాటిలో సోమవారం(16న) ఎఫ్‌ఎంసిజి దిగ్గజం హెచ్‌యుఎల్, […]

 అంతర్జాతీయ అంశాలపైనా దృష్టి పెట్టాలి: విశ్లేషకులు
ముంబై: ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ పరిణామాలపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గతవారం ఐటి దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు తొలి త్రైమాసికం ఫలితాలను వెల్లడించాయి. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్‌ఇండ్ సైతం పనితీరు వెల్లడించింది. ఇదే బాట లో ఈ వారం మరికొన్ని పెద్ద సంస్థలు క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్నాయి. వాటిలో సోమవారం(16న) ఎఫ్‌ఎంసిజి దిగ్గజం హెచ్‌యుఎల్, 17న జి ఎంటర్‌టైన్‌మెంట్, అశోక్ లేలాండ్ ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇంకా 18న అల్ట్రాటెక్ సిమెంట్, 19న కొటక్ మహీంద్రా బ్యాంక్, బ జాజ్ ఫైనాన్స్, 20న విప్రో, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ త దితరాలు ఫలితాలు వెల్లడించనున్నాయి. వీటితోడు 16న జూన్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్లుపిఐ) గణాంకాలను ప్ర భుత్వం వెల్లడించనుంది. మేలో డబ్లుపిఐ 4.43 శాతం పెరిగిం ది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. గణాంకాల విభాగం విడుదల చేసిన వివరాల ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) మే నెలలో 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ అంశాలు చూస్తే 16న యూఎస్-రష్యా సదస్సు జరగనుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పిఐలు) పెట్టుబడుల తీరు వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Stories: