కారు-లారీ ఢీ: యువతి మృతి

Women Dies In Road Accident

న్యాల్‌కల్ ః ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొన్న సంఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఎఎస్‌ఐ ఈశ్వర్ కథనం ప్రకారం… కర్ణాటక రాష్ట్రం మల్కాపూర్ గ్రామానికి చెందిన శంకరప్ప కుమార్తె డప్పుగొండ నర్సమ్మ అలియాస్ శివలీల (30) గత కొన్ని సంవత్సరాలుగా మండలంలోని ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఆత్యాత్మిక గురువుణిగా భక్తులకు సేవలందిస్తోంది. గతంలో మండలంలోని వడ్డి గ్రామంలో ఉంటూ భక్తులకు ఆత్యాత్మిక సేవలందించిన శివలీల గత మూడు సంవత్సరాల నుంచి మండలంలోని మిర్జాపూర్(బి) గ్రామ శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సేవలందిస్తోంది. శనివారం ఉదయం శివలీల తన కారులో కర్ణాటకలోని బీదర్ వైపు వెళుతుండగా మండలంలోని హుసెళ్లి గ్రామ శివారులో (జహీరాబాద్-బీదర్ రోడ్డుపై) ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో శివలీల కారు నుజ్జునుజ్జు కావడంతో శివలీల కారులోనే తిరిగిరాని లోకాలకు చేరిపోయింది. హద్నూర్ ఎఎస్ఐ ఈశ్వర్ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments