కారు-లారీ ఢీ: ఒకరు మృతి

మేడ్చల్: అదుపు తప్పిన కారు, లారీని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మేడ్చల్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై  చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ఉన్నట్లు సమాచారం. స్థానికులు గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా గాయ పడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు […]

మేడ్చల్: అదుపు తప్పిన కారు, లారీని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మేడ్చల్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై  చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ఉన్నట్లు సమాచారం. స్థానికులు గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా గాయ పడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments

Related Stories: