కారు బొల్తా పడి ఒకరు మృతి

Man Died in road Accident In Medchal District

శామీర్‌పేట : కారు అదుపు తప్పి ఒకరు మృతి చెందిన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కీసర మండలం నాగారం సింహపురి కాలనీకి చెందిన ఎస్. కీర్తి కుమార్(37) తన స్నేహితులు నాగరాజుగౌడ్, రాజేష్, కుమార్‌లతో కలిసి సమ్మర్‌గ్రీన్ రిసార్ట్‌లో కంపనీ మీటింగ్‌కు హజరయ్యారు. బుధవారం తెల్లవారు జామున అల్ఫాహరం చేయడానికి అంతాయిపల్లి వెళ్లి తిరిగి సమ్మర్ గ్రీన్ రిసార్ట్‌కు వస్తుండగా మార్గ మధ్యంలో దొంగల మైసమ్మ చౌరస్తా డోమౌస్ సమీపంలో మూల మలుపు వద్ద కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి పల్టికొట్టింది. దీంతో కీర్తి కుమార్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతవారికి సల్ప గాయాలు అయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments