కారు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

 అలంపూర్ (ఉండవెల్లి): అలసట, నిద్రలేమి ముగ్గురి ప్రాణాలు తెల్లారేలా చేసింది. పెళ్లికి వెళ్లి మరో పెళ్లికి రమ్మని ఆహ్వానించి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తండ్రి డ్రైవింగ్‌లో ఉండగా భయమెందుకు అని అదమరచి నిద్రించిన కూతురు నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లింది. భర్తపై నమ్మకంతో పడుకున్న భార్యకు తీవ్రగాయాలై ఆసుపత్రి పాలైంది. భర్త మృతి చెందాడని తెలియని భార్య చికిత్స గదిలో ఏమి జరిగిందో తెలియక అల్లాడిపోతోంది.. సోమవారం ఉదయం ఉండవెల్లి మండల పరిధి జాతీయ రహదారిపై జరిగిన […]

 అలంపూర్ (ఉండవెల్లి): అలసట, నిద్రలేమి ముగ్గురి ప్రాణాలు తెల్లారేలా చేసింది. పెళ్లికి వెళ్లి మరో పెళ్లికి రమ్మని ఆహ్వానించి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తండ్రి డ్రైవింగ్‌లో ఉండగా భయమెందుకు అని అదమరచి నిద్రించిన కూతురు నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లింది. భర్తపై నమ్మకంతో పడుకున్న భార్యకు తీవ్రగాయాలై ఆసుపత్రి పాలైంది. భర్త మృతి చెందాడని తెలియని భార్య చికిత్స గదిలో ఏమి జరిగిందో తెలియక అల్లాడిపోతోంది.. సోమవారం ఉదయం ఉండవెల్లి మండల పరిధి జాతీయ రహదారిపై జరిగిన సంఘటన ఓ కుటుంబంలో విషాదఛాయలు నెలకొల్పింది. ఎస్‌ఐ గడ్డం కాశీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కిరణ్ సింగ్ (54) భార్య గాయత్రి,కూతురు హర్షిత (18)లు కర్నూలులోని చిదంబర్‌వీధిలో నివాసముంటున్నారు. హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరై మరో పెళ్లికి పెండ్లి పత్రికలకు పంచేందుకు కుటుంబ బంధువులతో వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా కిరన్‌సింగ్ చెల్లెలు కూతురు గాయత్రి(18) కర్నూలు జిల్లా సున్పిపెంటకు చెందిన విజయలక్ష్మి, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్, పొన్నకల్ కు చెందిన విజిత్ సింగ్‌లు కారు నంబర్ ఏపి 21 సిఏ 4167 నంబరు కారులో బయలు దేరారు. హైదరాబాద్‌లో వివాహ వేడుకల్లో పాల్గొని బంధువులను పెళ్లికి రావాలని పత్రికలు అందించి ఆహ్వానించారు. ఆదివారం అర్దరాత్రి కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. అలంపూర్ చౌరస్తా ఫ్లై ఓరర్ దాటి 40 కిలో మీటర్ల వేగం పాటించాలని ఉన్న బోర్డులను ఢీకొని ఒక కిలోమీటరు దూరంలో టోల్‌గేటు ఉంది అన్న జాతీయ రహదారి సూచిక బోర్డుకు ఢీకొట్టింది. దీంతో కారులోని కిరన్‌సింగ్, హర్షిత, కోడలు గాయత్రిలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది పైలట్ శ్రీశైలం, ఏఎన్‌టి తిరుమలేశ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రగాయాలైన గాయత్రి, విజయలక్ష్మి, విజిత్ సింగ్‌లకు చికిత్సలందించి మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న సిఐ రజితరెడ్డి, డిఎస్‌పి సుధాకర్‌రావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృత దేహాలను శవ పరీక్షల నిమిత్తం అలంపూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ గడ్డం కాశీ తెలిపారు.

Related Stories: