కారు ప్రమాదంలో వ్యక్తి మృతి

car accident killed the man

సత్తుపల్లి: కారు పల్టీ కొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని దుద్దెపూడి గ్రామానికి చెందిన మోరంపూడి చంద్రశేఖర్ (35) తన భార్య నివేదితతో కలిసి కారులో తల్లాడ మండలంలోని నూతనకల్‌కు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరాడు. తుంబూరు-కిష్టాపురం గ్రామాల మధ్యకు చేరుకునే సరికి కారు ముందు టైర్ యాక్సిల్ ఇరిగి పోవడంతో వేగంగా వెళ్తున్న కారు పల్టీ కొట్టింది. దీంతో కారును నడుపుతున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నివేదితకు స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా సత్తుపల్లి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్ మృతదేహానికి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ ఎం.వెంకటనర్సయ్య తెలిపారు. మృతుడు చంద్రశేఖర్ మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.