కారు ఢీకొని బాలుడి మృతి

02gdl10-02గట్టు: కారు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చే సుకుంది. ఎస్‌ఐ రాంబాబు కథనం మేరకు వివరాలు ఇలా… గువ్వలదిన్నె తాండకు చెందిన బోధ్యానాయక్ కుమారుడు స్వామినాయక్ (10)లు ఆ దివారం ఉదయం కాలూరు తిమ్మన్‌దొడ్డి సమీపంలో ఉన్న తమ వ్యవసా య పొలానికి మోటార్‌సైకిల్‌పై వెళ్లారు. తిరుగుప్రయాణంలో మార్గమధ్య లో మోటార్‌సైకిల్ చైన్‌పడిపోవడంతో పక్కకు ఆపి సరిచేస్తుండగా, కర్ణా టకకు చెందిన బొజ్జరాజు తనకారుపై వేగంగా వచ్చాడు. మోటర్‌సైకిల్ పక్క నే నిలబడి ఉన్న బాలుడు స్వామినాయక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృ తి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుప త్రికి తరలించారు. తండ్రి బోధ్యానాయక్ ఫిర్యాదు మేరకు నిందితుని పై కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఐదుగురు కు మార్తెల తరువాత బాలుడు జన్మించడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నా రు. అయితే విధి వక్రించడంతో ప్రమాదంలో కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలెలా విలపించారు.

Comments

comments