కారు ఢీకొని ఒకరి మృతి..

Man Died In Road Accident
ధర్మారం: అతివేగంగా వచ్చిన కారు వ్యక్తిని  ఢీకొనడంతో  అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని కటికెనపల్లి శివార్‌లో  చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజేరుపల్లి గ్రామానికి చెందిన నున్యావత్ దేశాయ్ నాయక్ (42) మంగళవారం తన వ్యవసాయ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళెందుకు రోడ్డు ప్రక్కన్న నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో ధర్మారం వైపు నుండి కరీంనగర్ వైపు వెళుతున్న మంచిర్యాల జిల్లా కన్నెపల్లికి చెందిన ఎపి02ఎబి3357 కారు అతివేగంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ధర్మారం ఎస్‌ఐ దేవయ్య, ఎఎస్‌ఐ కిషన్, పిసి రాజేష్‌లు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందాడు. ఎఎస్‌ఐ మార్కోండ కిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments