కారు డివైడర్‌ను ఢీ…ఇద్దరు మృతి

రామాయంపేట : అదుపు తప్పి కారు డివైడర్‌ను ఢీకొన్ని ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు, కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా మారిన ఘటణ రామాయంపేట పట్టణ శివారులోని బైపాస్ రోడ్‌లో అడిగాస్ హోటల్ వద్ద చోటు చేసుకుంది. స్తానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డికి చెందిన సిరిగాద సంధీప్ శర్మ (28), మంచిర్యాలకు చెందిన సూర్యతేజ(28) నిజామాబాద్ నుంచి కారులో హైదరాబాద్ బయలు దేరారు. ఈ క్రమంలో రామాయంపేట శివారులోని బైపాస్ […]


రామాయంపేట : అదుపు తప్పి కారు డివైడర్‌ను ఢీకొన్ని ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు, కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా మారిన ఘటణ రామాయంపేట పట్టణ శివారులోని బైపాస్ రోడ్‌లో అడిగాస్ హోటల్ వద్ద చోటు చేసుకుంది. స్తానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డికి చెందిన సిరిగాద సంధీప్ శర్మ (28), మంచిర్యాలకు చెందిన సూర్యతేజ(28) నిజామాబాద్ నుంచి కారులో హైదరాబాద్ బయలు దేరారు. ఈ క్రమంలో రామాయంపేట శివారులోని బైపాస్ సర్కిల్ వద్ద అతివేగంగా వీరి కారు డివైడర్‌ను గుద్దుకుంది. దీంతో అందులో ఉన్న సంధీప్‌తో పాటు ,సూర్యతేజలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ హైమద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులతో పాటు తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ హైమద్‌ను 108లో స్తానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మరణంలో కూడా వీడని స్నేహ బంధం… మృతులు సంధీప్,సూర్యతేజలు ఇద్దరు మంచి మిత్రులు, క్లాస్‌మెట్స్ కూడా వీరద్దరు ఒకేసారి కారు ప్రమాదంలో చనిపోయారు. మరణంలోనూ వీరి బంధం వీడలేదు. కాగా సూర్యతేజ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా గత రెండు మాసాల క్రితమే ఇండియా వచ్చాడు. మృతుల బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు రామయంపేట ఎస్‌ఐ మహేందర్ తెలిపారు. పంచనామా నిర్వహించిన అనంతరం శవాలకు పోస్టుమార్టం చేయించి మృతదేహలను బందువులకు అప్పగించారు.

Comments

comments

Related Stories: