కారు-టిప్పర్ లారీ ఢీ: ఇద్దరు మృతి

Two Dead in Road Accident in Nirmal District Today

నిర్మల్: కారును టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments