కారు అదుపుతప్పి చిన్నారి మృతి

boby dead in road accident

వైరా: వైరా తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటి ఎన్నికల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న ఫిరంగి స్వాతిబిందు, ఆమె భార్త, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా కట్టంగూర్ మండలం మాణిక్యాలమ్మ గూడెం వద్ద కారు అదుపుతప్పి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వాతిబిందు రెండుసంవత్సరాల కూతురైన రుక్షర అక్కడికక్కడే మృతి చెందగా ప్రమాదంలో స్వాతిబిందు ఆమె భార్త, కుమారుడు గాయపడటంతో వారిని 108ద్వారా హాస్పిటల్‌కు తరలించారు. స్వాతిబిందువు కుటుంబసభ్యులు రోడ్డుప్రమాదంలో గురైన సంఘటన తెలుసుకున్న వైరా తహశీల్దారు కోటా రవికుమార్, విఆర్‌ఒలు, పలువురు కార్యాలయ సిబ్బంది ఖమ్మం చేరుకొని స్వాతిబిందువును ఒదార్చారు. ఈ ప్రమాద ఘటనతో వారి కుటుంబంలో విషాయఛాయాలు అలుముకున్నాయి.

Comments

comments