కారంచేడు వీరులకు నివాళులు…

జనగామ : అగ్రకుల అహంకార ఊచకోతకు బలైన కారంచేడు మృత వీరులకు జనగామలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం నల్ల రిబ్బన్లు ధరించి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. నేటి అణగారిన వర్గాలకు 33 ఏళ్ల క్రితం కారంచేడులో జరిగిన నరమేధంలో వీరమరణం పొందిన వారి పోరాటం స్ఫూర్తిదాయకమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ జనగామ జిల్లా ఇన్‌చార్జ్ రాగల్ల ఉపేందర్, జిల్లా నాయకులు చెరుపల్లి కుమార్‌మాదిగ, పవన్‌నాయక్, లెనిన్ నాయక్, ఉదయ్, హరీష్, రాజు, […]


జనగామ : అగ్రకుల అహంకార ఊచకోతకు బలైన కారంచేడు మృత వీరులకు జనగామలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం నల్ల రిబ్బన్లు ధరించి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. నేటి అణగారిన వర్గాలకు 33 ఏళ్ల క్రితం కారంచేడులో జరిగిన నరమేధంలో వీరమరణం పొందిన వారి పోరాటం స్ఫూర్తిదాయకమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ జనగామ జిల్లా ఇన్‌చార్జ్ రాగల్ల ఉపేందర్, జిల్లా నాయకులు చెరుపల్లి కుమార్‌మాదిగ, పవన్‌నాయక్, లెనిన్ నాయక్, ఉదయ్, హరీష్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.