కామినేని జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ ప్రారంభం

హైదరాబాద్ : ఎల్‌బినగర్‌లోని కామినేని జంక్షన్ వద్ద ఫై ఓవర్‌ను తెలంగాణ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కెటిఆర్ తెలిపారు. నగరంలో 32 నుంచి 35 శాతం మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు వినియోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 65 శాతం మంది పొంత వాహనాలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. 32 వేల కోట్లతో నగర అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ […]

హైదరాబాద్ : ఎల్‌బినగర్‌లోని కామినేని జంక్షన్ వద్ద ఫై ఓవర్‌ను తెలంగాణ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కెటిఆర్ తెలిపారు. నగరంలో 32 నుంచి 35 శాతం మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు వినియోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 65 శాతం మంది పొంత వాహనాలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. 32 వేల కోట్లతో నగర అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ ఆర్.కృష్ణయ్య, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Kamineni Junction Flyover Inauguration by KTR

Comments

comments

Related Stories: