కామినేని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

Kamineni Hospital Staff take selfie with Harikrishna body

నల్గొండ: సినీ నటుడు, మాజీ ఎంపి, టిడిపి నేత నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, యాక్సిడెంట్ తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆయనను నార్కెట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచాడు. అయితే, కామినేని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. హరికృష్ణ భౌతికకాయంతో నలుగురు సిబ్బంది సెల్ఫీలు దిగారు. సెల్ఫీ దిగిన వారిలో ఇద్దరు డ్యూటీ నర్సులు, వార్డు బాయ్, వార్డు గర్ల్  ఉన్నారు. వారు దిగిన సెల్ఫీలను స్నేహితులకు పంపించడంతో ఈ నిర్వాకం బయటకు వచ్చింది. సెల్ఫీ పిచ్చికి ఇది పరాకాష్ట అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Comments

comments