కాఫీ మ్యూజియం

Special Story On Araku Coffee House in Andhra Pradesh

తొలి పొద్దున్నే పొగ మంచు కరిగిపోతూ ఉంటే.. అప్పుడే తుంచి తెచ్చిన కాఫీ గింజలతో కలిపిన తాజా కాఫీ రుచి మన చేతిలో ఆహా.. అంతటి మహాద్భుత యోగం ఎక్కడ దొరుకుతుందని అనుకుంటున్నారా? ఎక్కడో కాదు… అరకు కాఫీ మ్యూజియంలో అడుగుపెట్టండి చాలు. ప్రకృతి స్వయంగా కాఫీ కలిపి ఇస్తే ఎలా  ఉంటుందో మనకే తెలుస్తుంది. అందాల అరకు లోయలో 64 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ మ్యూజియం. వందకు పైగా అదుతమైన కాఫీ రుచులను పరిచయం చేసే అందమైన కాఫీ ప్రపంచం ఈ మ్యూజియం. ప్రపంచంలోనే ఖరీదైన కాఫీలను మొదలుకుని ఎత్నిక్, అరబిక్, అమెరికానో, వియన్నా, మెకికానో, వెట్‌కేఫే, మోచా, కోల్డ్ ఐరిష్ వరకూ అనేక రకాల కాఫీలను ఇక్కడ రుచి చూడొచ్చు. అలాగే చాక్లెట్ రుచి కలిపిన ఐస్ కాఫీ రకాలు ఇక్కడ ప్రత్యేకం. ఎటువంటి కాఫీ అయిన ఆర్డర్ చేసిన ఐదు నిమిషాల్లోనే మన ముందుంటుంది. ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఈ మ్యూజియం తెరిచే ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు అక్కడి ఆదివాసులు వేసే థింసా నృత్యాలను చూసి కమ్మని కాఫీ బొట్టు బొట్టుగా ఆస్వాదించొచ్చు.

Comments

comments