కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం…

మేడ్చల్: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యప్రకాష్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా షామీర్‌పేట్ పిఎస్ నుంచి మేడ్చల్ పిఎస్‌కు సూర్యప్రకాష్ బదిలీ అయ్యాడు. అయితే, గత మూడు రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. కానీ ఆత్మహత్యాయత్నం ఎందుకు […]

మేడ్చల్: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యప్రకాష్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా షామీర్‌పేట్ పిఎస్ నుంచి మేడ్చల్ పిఎస్‌కు సూర్యప్రకాష్ బదిలీ అయ్యాడు. అయితే, గత మూడు రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. కానీ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనేది తెలియాల్సి ఉంది.

Related Stories: