కాకిపడగల పటం కథ

కాకి పడిగెల వారు మహాభారతం కథలనే ఎందుకు చెప్తారనడానికి కూడా ఒక కథను వినిపిస్తారు. కళాకారులు ముదిరాజులు ఇచ్చే త్యాగం లేదా ప్రతిఫలాన్ని బట్టి కథలు చెప్పే రోజులను నిర్ణయించుకుటారు. అయిదు రోజులు, తొమ్మిది రోజులు, 20 రోజులు ఇట్లా వారిచ్చే ప్రతిఫలాన్ని చేసుకొని పాండవులు పుట్టుక నుండి కురుక్షేత్రం యుద్ధం వరకు ఉన్న కథలను తగ్గించుకోవటం అవసరమైతే పెంచుకోవటం చేసి చివరి రోజున పెద్దమ్మ తల్లి కథతో ముగిస్తారు. కళాకారులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక […]

కాకి పడిగెల వారు మహాభారతం కథలనే ఎందుకు చెప్తారనడానికి కూడా ఒక కథను వినిపిస్తారు. కళాకారులు ముదిరాజులు ఇచ్చే త్యాగం లేదా ప్రతిఫలాన్ని బట్టి కథలు చెప్పే రోజులను నిర్ణయించుకుటారు. అయిదు రోజులు, తొమ్మిది రోజులు, 20 రోజులు ఇట్లా వారిచ్చే ప్రతిఫలాన్ని చేసుకొని పాండవులు పుట్టుక నుండి కురుక్షేత్రం యుద్ధం వరకు ఉన్న కథలను తగ్గించుకోవటం అవసరమైతే పెంచుకోవటం చేసి చివరి రోజున పెద్దమ్మ తల్లి కథతో ముగిస్తారు. కళాకారులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి కార్తీకమాసంలో మిరాశి గ్రామాలకు కథలు చెప్పడానికి వెళ్తారు. మళ్లీ వర్షాలు పడే వరకు మిరాశి గ్రామాల్లో సంచరిస్తూ తిరిగి ఇంటికి వస్తారు. గ్రామాలకు వెళ్లే ముందర దసరా రోజున పెద్దమ్మ తల్లిని పూజించుకుంటారు. కళాకారులు బృందం తయారు చేసుకునే ముందు కూడా అనుష్టానం జరిపి బయలు దేరుతారు. మిరాశి గ్రామంలోకి వెళ్లిన బృందం మొదట ముదిరాజుల కుల పెద్ద ఇంటి దగ్గర ‘నగరా’ వాయించి, మద్దెల, హార్మొనియమ్‌తో పాటలు పాడి త్యాగం కథలు ప్రదర్శించేలా నిర్ణయించుకుంటారు.

తెలంగాణలోని జానపద గిరిజన కళారూపాల్లో పటం కథల శైలి ప్రత్యేకమైనది. ఈ పటం కథలు పదమూడు వరకు అవసానదశలో మనుగడ సాగిస్తున్నవి. ఆశ్రిత కళారూపాల్లో భాగమైన పటం కథలు తమ దాతృకులం లేదా పోషక కులం కులపురాణాన్ని ప్రధానంగా గుర్తిస్తూ వారి మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తూ వస్తున్నవి. అయితే ముదిరాజ్‌లను ఆశ్రిత కళారూపమైన ‘కాకిపడిగల పటం కథ’, పటం ఆధారంగా ముదిరాజ్‌ల పురాణాన్ని చెప్పటమే కాకుండా, మహాభారతంలోని పన్నెండు పర్వాలను సుమారుగా ఇరవై తొమ్మిది కథలుగా చేసుకొని కథాగానం చేయటం విశేషం. ఇట్లా వీరు పాండవుల కథలు చెప్పటంతో ‘పాండవులొళ్లు’ అని కూడా పిలుస్తారు.

ముదిరాజ్‌లు కాకిపడిగెల కులోత్పత్తి

కాకిపడిగెల కళాకారులు పటం ఆధారంగా మౌఖికంగా చెప్పే పురాణాన్ని బట్టి పూర్వం యయాతి మొదటి భార్య శర్మిష్ట, రెండవ భార్య దేవయాని. ఇందులో శర్మిష్టకు ఒక కొడుకు ఉండగా , దేవయానికి నలుగురు కొడుకులుంటారు. అయితే దేవయాని తండ్రి శుక్రాచార్యుడు యయాతిని మొదటి భార్య శర్మిష్టను కలువద్దని ఒకవేళ కలుస్తే ముసలివానిగా మారుతావని శపిస్తాడు. అయినప్పటికీ యయాతి శర్మిష్టను కలువగా ముసలివానిగా మారుతాడు. ఆ తర్వాత యయాతి తన సుఖభోగాల మీద వ్యామోహం తీరక నాకు యవ్వనం కావాలని శుక్రాచార్యున్ని వేడుకుంటే దేవయానికి శర్మిష్టకు పుట్టిన అయిదుగురు కుమారుల్లో నీకు ఎవరైతే యవ్వనాన్ని ప్రసాదిస్తారంటో, వారి యవ్వనం నీకు వచ్చి, నీ ముసలితనం వారికి పడుతుంది. అందుకు నువ్వు వారికి రాజ్యాన్ని కానుకగా ఇవ్వమంటాడు. ఆ ప్రకారంగా యయాతి మొదట దేవయాని నలుగురు కొడుకులను కలిసి నాకు మీ యవ్వనాన్ని ప్రసాదించడని కోరగా వారు తిరస్కరిస్తారు. అందుకు కోపంతో వారిని యయాతి వరుసగా (ఎర్రగొల్ల, బెస్త, వరపద్మనాయకులు, ఈడిగ) నాలుగు కులాలుగా మారండని శపిస్తాడు. చివరగా శర్మిష్ట కొడుకును అడగ్గా అతను సరేనని, తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతని ముసలితనాన్ని స్వీకరిస్తాడు. కొన్నేళ్లు యయాతి సుఖభోగాలు అనుభవించి రాజ్యాన్ని పరిపాలించి, తర్వాత కొడుకు దగ్గరికి వచ్చి తిరిగి తన యవ్వనాన్ని కొడుకుకు ప్రసాదించి అతని ముసలితనాన్ని తాను స్వీకరిస్తాడు.

అప్పుడు తండ్రి! లోకజ్ఞానుడైన ఒక కుమారుడు చాలునని తండ్రి ముసలితనం తీసుకొని యవ్వనాన్ని ప్రసాదించిన నువ్వు ముది వంశంలోపల ‘ముదిరాజు’వని దీవిస్తాడు. యయాతి ఈ రకంగా ముదిరాజుల కులోత్పత్తి జరుగుతుంది. ముదిరాజ్‌ల తోడబుట్టిన అక్క శబరి. ఈమెకు పెళ్లి చేస్తానంటే వద్దని పండ్లు, పూలతోటలు పెంచి పెందోట వనంలోనే పండు ముసలిగా మారుతుంది. ఆమెకు కళ్లు కనిపించవు. అయినప్పటికీ ఆమె తియ్యగా ‘ఉండే పండ్లను తెంపి ఆ దారివెంటపోయే నరులకు, దేవతలకు దానం చేస్తూ’ ఉంటుంది. ఆమె పెందోట వనంలో ఉండే స్త్రీ కాదని రామ చిలుకని పిలుస్తారు. ఒకరోజున రామలక్ష్మణులు సీతను వెతుకుతూ పెందోట వనానికి రాగా శబరి వారిని సాదరంగా ఆహ్వానించి తాను ఎంగిలి చేసిన పండ్లను పెడుతుంది. రాముడు ఆ పండ్లను తినగా లక్ష్మణుడు తిరస్కరిస్తాడు. అప్పుడు శ్రీరాముడు శబరి గొప్పదనాన్ని చెబుతూ ఆమె మూడు యుగాల్లో కన్యగా ఉన్న రామచిలుక అని, ఆమె ఎంగిలి చేసిన పండ్లు తినని మానవుడు దేవుడు లేదని చెబుతాడు.

అప్పుడు లక్ష్మణుడు కూడా ఆమె చేత పండ్లు భుజిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణులను వచ్చిన కారణం అడుగుతుంది శబరి. రాముడు సీతాపహరణం గురించి చెప్పగా, అయితే మీరు ఇక్కడికి ఉత్తరాన వాలి, సుగ్రీవ, ఆంజనేయులున్నారని, వారు సీత జాడ చూపుతారని చెబుతుంది.అప్పుడు శ్రీరాముడు తల్లీ! మా ఆకలి తీర్చడమే కాకుండా, సీత జాడ తెలిసే దారి చూపావని నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆమె నాకు ఎవరూ లేరని, నాకున్నది నా తమ్ముడు ముదిరాజ్ అని, అతనికి కులం ఉంది కానీ ఇంటిపేరు లేదని, మీ ఇంటి పేరు ‘ఇనుగుల’ వారటు అది మా తమ్మునికివ్వమని కోరుతుంది. అందుకు రాముడు సంతోషించి ఏ తమ్ముని కొరకు నా ఇంటి పేరు కోరావో,, ఈ పెందోటివనాన్ని పెద్ద చేస్తున్నావో ఈ వనంలోనే వచ్చిపోయే వారికి పెద్దమ్మవై నిలువుమని దీవిస్తాడు. ఈ రకంగా పెద్దమ్మతల్లి ముదిరాజులకు ఆడబిడ్డ కావడంతో అందుకే ఆ తల్లిని పూజిస్తారు. అందుకే ఆమె ఆలయాలు, తోటలు ఊరిబయటనే ఉంటాయి.
కాకిపడిగెల పుట్టుక

జమ్మూకేశ్వర మహారాజు, సూర్యమహదేవికి ఐదుగురు పుత్రులుంటారు. వీరు నందనుడు, బాలకుడు, దుగ్గన బోయుడు, దుర్వరుడు, జంపన్న. ఇందులో బాలకుడు ప్రతిరోజూ పెందోట వనంలోని పుష్పాలను తెంపుకొని దేవతలకు అర్పించేవాడు. ఒకనాడు ఔసలి రామన్న ఆ పుష్పాలు నాక్కూడా కావాలని కోరగా ఆ బాలకుడు తిరస్కరిస్తాడు. అందుకు ఔసలి రామన్న అవమానంగా భావిస్తాడు. అంతేకాకుండా ఒకరోజున వీరి తల్లియైన సూర్యమహాదేవి పండ్లు అమ్ముతుండగా ఔసలి రామన్న ఆమె గంపలో చేయి పెడితే ఆమె కోపగిస్తుంది. ఇందుకు అవమానంగా భావించిన రామన్న వీరికి ఫలాలు, పుష్పాలు ఉండే తోట కారణంగా వీరికంత గర్వం వచ్చిందని, ఆ తోటను నాశనం చేయాలని రకరకాల పక్షులతో పాటుగా ఒక కాకాసురుడు అనే కాని కాని చేసి తోటకు పంపుతాడు. ఈ తోటకు కావలిగా ఉన్న బాలకుడు ఆ కాకికి ఎన్ని బాణాలు వేసినా మింగుతుంది. అప్పుడు అతను రామబాణం వేయగా ఆ కాకి తప్పించుకుంటూ చివరకు అయోధ్యలోని శ్రీరాముని వద్దకు వెళ్లి శరణు కోరుతుంది. శ్రీరాముడు ఆకాక దుష్ట బుద్ధిని చంపి రక్షిస్తాడు.

ఆ బాలకుడు అయోధ్యకు రాగానే అతనితో నువ్వు అసురుడైన కాకితో యుద్ధం చేసి గెలిచావని నీ తండ్రి వద్దకు ఈ కాకిని తీసుకెళ్లి విషయం చెప్పమంటాడు. అయితే ఆ కాకితో యుద్ధం ఆరు నెలలు జరుగుతుంది. ఈలోగా ముదిరాజ్‌లు సంపన్నులవుతారు. వీరు తండ్రి ఏడు అంతరాల బండ్ల దాని మీద ఒక నాగ పడగను కట్టిస్తాడు. ఆ బాలకుడు ఆకాకిని ఇంటి మీది నాగపడిగె కింద ఉంచి తల్లిదండ్రులను కలిసి ఔసలి రామన్న సృష్టించిన మాయా కాకాసురున్ని జయించినానని, అదిగో కాకి అని సూచిస్తాడు. అప్పుడు తల్లి పవిత్రమైన పడిగె నీడన, కాకిని ఉంచినవని నువ్వు కాకి పడిగెల వాడివైపొమ్మని శపిస్తుంది. ఆ కారణంగా ‘కాకి పడిగెల’ పేరు వచ్చిందని కళాకారులు చెబుతారు. మరొక కథలో కాకిని చంపటంతో కాకి పడిగెల వారయ్యామని అంటారు. ఆ తర్వాత తల్లి కొడుకును ఇంట్లోకి రమ్మని కోరగా వెళ్లకుండా, నాకు భృతి చెప్పమని కోరగా, నా ఇంట్లో పుట్టిన వాడివి కాబట్టి నా అర్థబిడ్డవై భారత కథలు చెప్పుకుంటూ, మేమిచ్చే ప్రతిఫలంతో జీవించమంటుంది. ఇతని సంతతియే సుమారుగా 45 మూరల పటం మీద భారతం కథను నకాశి చిత్రకారులతో చిత్రించి ముదిరాజ్‌లకు కథలు చెప్పుతూ వస్తున్నారు.

కళాకారులకు సంక్రమించిన మిరాశిగ్రామానికి వెళ్లినప్పుడు సందర్భాన్నిబట్టి మూడు రకాలుగా చెప్పారు. ఇందులో త్యాగం కథలు, చావు కథలు, ఉల్ఫా కథలు అని చెప్పటం జరుగుతుంది. కళాకారులు ప్రధానంగా చెప్పే కథల్లో ముదిరాజుల వృత్తాంతం, పాండువల పుట్టుక, ధర్మరాజు జూదం, పాండవ వనవాసం, విరాటుని కొలువు, బకాసుర వధ, కీచక వధ, గారముల కోటు, సుభద్ర కల్యాణం, కర్ణుని పెళ్లి, సహదేవుని కల్యాణం, గోవుల చెర, శశిరేఖా పరిణయం, నవలోకపరిణయం, రంపాలరాజు, మాయాబజార్, గదాయుద్ధం, భీష్మమరణం, భీమవిషపన్నం, అభిమన్యు మరణం, దుర్యోధన వధ, కురుక్షేత్రం, అల్లిరాని కథ, లక్కాగృహం, రాజసూయ యాగం, భీమాంజనేయ యుద్ధం, శ్రీకృష్న రాయబారం, పెద్దమ్మకథ మొదలైన కథల్ని పటుం ఆధారంగాప్రదర్శించే కథలు. అయితే ముదిరాజ్‌లు కురుక్షేత్రం చెప్పిస్తే వర్షాలు కురుస్తాయని తప్పనిసరిగా ఆ కథనే చెప్పిస్తారు. కాకి పడిగెల వారు మహాభారతం కథలనే ఎందుకు చెప్తారనడానికి కూడా ఒక కథను వినిపిస్తారు. కళాకారులు ముదిరాజులు ఇచ్చే త్యాగం లేదా ప్రతిఫలాన్ని బట్టి కథలు చెప్పే రోజులను నిర్ణయించుకుటారు. 5 రోజులు, 9 రోజులు, 20 రోజులు ఇట్లా వారిచ్చే ప్రతిఫలాన్ని చేసుకొని పాండవులు పుట్టుక నుండి కురుక్షేత్రం యుద్ధం వరకు ఉన్న కథలను తగ్గించుకోవటం అవసరమైతే పెంచుకోవటం చేసి చివరి రోజున పెద్దమ్మ తల్లి కథతో ముగిస్తారు. కళాకారులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి కార్తీకమాసంలో మిరాశి గ్రామాలకు కథలు చెప్పడానికి వెళ్తారు. మళ్లీ వర్షాలు పడే వరకు మిరాశి గ్రామాల్లో సంచరిస్తూ తిరిగి ఇంటికి వస్తారు.

గ్రామాలకు వెళ్లే ముందర దసరా రోజున పెద్దమ్మ తల్లిని పూజించుకుంటారు. కళాకారులు బృందం తయారు చేసుకునే ముందు కూడా అనుష్టానం జరిపి బయలు దేరుతారు. మిరాశి గ్రామంలోకి వెళ్లిన బృందం మొదట ముదిరాజుల కుల పెద్ద ఇంటి దగ్గర ‘నగరా’ వాయించి, మద్దెల, హార్మొనియమ్‌తో పాటలు పాడి త్యాగం కథలు ప్రదర్శించేలా నిర్ణయించుకుంటారు. ప్రదర్శనలో కళాకారులు ఆరుగురు ఉంటారు. ఇందులో ప్రధాన కథకుడు ధోతి, లాల్చిధరించి, చేతిలో చూపుడు కర్ర, కాళ్లకు గజ్జెలు, నడముకు ఒక పంచె కట్టుకొంటాడు. మిగతా వారిలో ఒకరు ‘ఉపకథానాయకుడు కాగా, హార్మోనియమ్, మద్దెల, తాళాలు వాయించే వారుంటారు. వీరు ప్రధాన కథకునికి తాళాలు వాయిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒకరిచేత స్త్రీ పాత్ర వేషం వేయించి పటం ముందర వంతపాడించటం జరుగుతున్నది. ముదిరాజు కుల పెద్దలు సూచించినట్టుగా కథను పగలుగాని, రాత్రిగాని, వారి వీధిలోనే రంగస్థలాన్ని నిర్మించుకొన్ని ప్రదర్శిస్తారు. పటాన్ని వ్రేలాడదీసి కళాకారులు కథలో ప్రేక్షకులు లీనమయ్యేందుకు కథాప్రారంభం నుండి సందర్బాన్ని బట్టి సమాజంలో సంఘటనలు ఆధారంగా చేసుకొని పిట్టకథలు సామెతలు, పొడుపు కథలు చెప్పుతూ, మధ్య మధ్యలో హాస్యాన్ని పండిస్తూ రక్త కట్టిస్తారు. ప్రదర్శనలో ప్రధాన కథకుడు విశ్రాంతి తీసుకుంటే ఉపప్రధాన కథకుడు లేదా ప్రధాన వంత ఎక్కువగా హాస్యాన్ని కలిగించే కథలు పాటలు పాడుతారు. అంతేగాకుండా కథకు, ప్రదర్శనకు పవిత్రతను ఆపాదించటం కోసం ప్రదర్శనలో సందర్భాన్ని పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను కథలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తారు. సహదేవుని కల్యాణం, శశిరేఖాపరిణయం వంటి కథల సందర్భంగా కళాకారులు ప్రేక్షకులు ఇంటి ఆడపడుచు పెళ్లి జరుగుతుదన్నట్లుగానే వారి చేత కట్నాలు చదివింపులు చేయిస్తారు.

కళాకారులు సందర్భాన్ని బట్టి తమను ఆదరించిన కులంపెద్దలను మధ్య మధ్యలో పొగుడుతూ, తమకు వచ్చిన చదివింపులకు దీవనార్తి పెడుతూ ప్రదర్శన కొనసాగిస్తారు. ప్రదర్శన చివరి రోజున ముదిరాజుల ఆడబిడ్డయైన పెద్దమ్మ కథ చెప్పి, ఆమెకు మేకపోతును బలిచ్చి ఆ గ్రామంలో ముదిరాజుల ఆచారాన్ని బట్టి బలిచల్లుతారు. కళాకారులు ముదిరాజుల్లో ఎవరికైనా మరణం సంభవిస్తే ఆ సమయంలో పాండురాజు మరణం, దుర్యోధనవధ, పద్మ వ్యూహం, భీమ విషపన్నం మొదలైన విషాదాంత కథలను ప్రదర్శిస్తారు. ఆయా కళాకారులు ముదిరాజ్‌లిచ్చేదానాలు, ఆయా మిరాశి గ్రామాలలోని రాగి శాసనం మీద రాయబడి ఉంటాయి. కళాకారులు మిరాశి గ్రామాలకు వెళ్లినప్పుడు రాగిశాసనం కూడా పటంతోపాటు తీసుకెళ్తారు.

కళాకారుల నేటి సామాజిక స్థితి

ముదిరాజుల సాంస్కృతిక మనుగడను పరిరక్షిస్తూ, మహాభారతం వంటి ఇతిహాసాన్ని కథాగానం చేస్తూ వస్తున్న కాకిపడిగెలవారు వరంగల్లు , సిద్ధిపేట, నల్లగొండ, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉన్నారు. పటం కథల కళారుపాల్లోనే ఒక సంవత్సరంలో ఎక్కువ నెలలు సంచార జీవిత గడిపేది వీరేనని చెప్పవచ్చు. ప్రదర్శనలు లేనప్పుడు కళాకారులు శికారి చేసుకుంటూ జీవిసారు. గొప్ప సాంస్కృతిక నేపథ్యం, సంస్కృతి కలిగిన ‘కాకిపడిగెల’ వారిని తమకంటూ ప్రభుత్వ రికార్డులో ‘కాకిపడిగెల అనేది కులంగా గుర్తించకుండా, తాము ఆశ్రయించి కథలు చెప్పే ‘ముదిరాజుల కులంగానే గుర్తించి BC–D సర్టిఫికెట్‌ను ప్రభుత్వం జారీ చేస్తున్నదని కళాకారులు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. అలాగే కళనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న కాకిపడిగెల వారు తమను ఎం.బి.సి లోనై-నా చేర్చాలని, తమ సంస్కృ తి మనుగడకు కావల్సిన ఆర్థిక వనరులను అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒకప్పుడు కళాకారులు ఒక ఊరిలో 10 నుండి 20 రోజుల వరకు ప్రదర్శనలిచ్చేవారు. కానీ ప్రస్తుతం అయిదురోజులు మూడు రోజులకు పరిమితమయ్యామని ముందు ముం దు మా కళకు ఆదరణ తగ్గిపోయే ప్రమా దం లేకపోలేదని కళాకారులు అంటున్నారు.

Comments

comments