కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Collector

సిరిసిల్ల : రోజులుగా ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ముందు ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తుండడంతో పది రోజులుగా తరగతులు సరిగ్గా నిర్వహించడం లేదన్నారు. పదహారేళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లు శ్రమదోపిడికి గురవుతున్నారని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్, లావణ్య, ప్రియాంక, సునీల్, అనిల్, దివాకర్ పాల్గొన్నారు.

జగిత్యాలలో: కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా కాంట్రాక్ట్ లెక్చరర్లు బుధవారం కళ్ళకు గంతలు కట్టు కొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, గంగారెడ్డి, కృష్ణమోహన్, వాసు, శ్రీనివాస్, కుమార్, నర్సింగం, సౌజన్య, స్వప్న, శ్రీహరి పాల్గొన్నారు.

Comments

comments