కాంగ్రెస్ వ్యూహం పని చేసేనా?

హోదా గురించి, విభజన హామీల అమలు గురించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షంతోపాటు అన్ని ప్రతిపక్షాలు, పార్టీలకు బయటి ప్రముఖులు, సంస్థలు గొంతెత్తుతున్నాయి. కాని తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలుకు అక్కడి అధికార పక్షం, ప్రభుత్వం పట్టుబడుతుండగా ప్రతిపక్షాలు, బయటి  ప్రముఖులుగాని ఇంచుమించు మౌనంగా ఉండటం అర్థంకాని పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టులు, టిడిపిలు ప్రభుత్వాన్ని విమర్శించటమనే తమ బాధ్యతను నెరవేర్చుకోవటం మినహా, తెలంగాణ రాష్ట్రంపట్ల తమ బాధ్యతను పట్టించుకోవటం లేదు.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ […]

హోదా గురించి, విభజన హామీల అమలు గురించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షంతోపాటు అన్ని ప్రతిపక్షాలు, పార్టీలకు బయటి ప్రముఖులు, సంస్థలు గొంతెత్తుతున్నాయి. కాని తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలుకు అక్కడి అధికార పక్షం, ప్రభుత్వం పట్టుబడుతుండగా ప్రతిపక్షాలు, బయటి  ప్రముఖులుగాని ఇంచుమించు మౌనంగా ఉండటం అర్థంకాని పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టులు, టిడిపిలు ప్రభుత్వాన్ని విమర్శించటమనే తమ బాధ్యతను నెరవేర్చుకోవటం మినహా, తెలంగాణ రాష్ట్రంపట్ల తమ బాధ్యతను పట్టించుకోవటం లేదు. 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 22న సమావేశమైనపుడు, అందులో ఏమి చర్చిస్తారు, ఏమి నిర్ణయిస్తారని చాలా మంది ఎదురు చూసి ఉంటారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అది మొదటి సమావేశమైనందున ఆ వివరాలను ఆసక్తికరంగా గమనించటం సహజం. కాని సమావేశం రొటీన్ నిర్ణయాలు కొన్ని తీసుకోవటం మిన హా ప్రజలకు విశ్వాసం కలిగించేవంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. అందులో, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయం ముందుగా చర్చించి తర్వాత తక్కినవి చూద్దాం.
రాగల కాలంలో, అనగా 2019 ఎన్నికల వరకు గల ముందు కాలంలో, పది అంశాలపై దృష్టిపెట్టగలమని వర్కింగ్ కమిటీ పేర్కొన్నది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన ఒకటి. కమిటీ సమావేశానికన్నా కొద్ది రోజుల ముందు ఇదే హోదా ప్రశ్నపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చింది. ఆ తీర్మానం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది అయినప్పటికీ దానిని కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. చర్చ తీరుకు గమనించిన వారికి రెండు విషయాలు దృష్టికి వచ్చాయి. అవిశ్వాస తీర్మానాలను టిడిపితోపాటు కాంగ్రెస్ తదితరులు కూడా ఇచ్చారు. ఉమ్మడిగా కాదు, వేర్వేరుగా. అవిశ్వాసానికి కారణాలను ఎవరివి వారు పేర్కొన్నారు. కాని అందరికన్నా ముందు తీర్మానం ఇచ్చింది టిడిపి అయినందున దానినే స్వీకరిస్తున్నట్లు సభాపతి సుమిత్రా మహాజన్ ప్రకటించారు. కాని చర్చ హోదాపై దృష్టి కేంద్రీకరించి జరగలేదు. టిడిపి మాత్రమే ఆపని చేసింది. కాంగ్రెస్ ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని తన అజెండా గురించి మాట్లాడింది. హోదా ప్రస్తావన మాట వరసకు మాత్రమే చేసింది. ఇది మొదటి విషయం కాగా, ప్రస్తుతం ఉన్న వివిధ పరిస్థితుల మధ్య ప్రత్యేక హోదాను ఏ పద్ధతిలో ఇవ్వగలరనే విషయాన్ని టిడిపిగాని, కాంగ్రెస్‌గాని రేఖా మాత్రంగానైనా సూచించలేదు. ఇది రెండవది.
హోదా ప్రశ్న కొంతకాలంగా చర్చలో ఉంది. ఇటు టిడిపి, అటు కేంద్ర ప్రభుత్వం దేని వాదనలు అవి చేస్తున్నాయి. సాధ్యాసాధ్యాలను పేర్కొంటున్నాయి. హోదా డిమాండ్‌ను కాంగ్రెస్ మొదటి నుంచి బలపరుస్తున్నది. ఈ పరిస్థితుల మధ్య, ఒకవేళ తాము అధికారానికి వచ్చినట్లయితే ఫలానా పద్ధతిలో అవరోధాలను అధిగమించి ప్రత్యేక హోదాను ఇవ్వగలమని కాంగ్రెస్ పార్టీ వివరించి చెప్పగలగాలి. ముఖ్యంగా రెండు అంశాలను గమనించినట్లయితే, 14వ ఆర్థిక సంఘం, దానితోపాటు నీతి ఆయోగ్ తీసుకున్న వైఖరులను ఎట్లా అధిగమిస్తారన్నది మొదటి వివరణ కావాలి. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇచ్చినట్లయితే తమకు కూడా ఇవ్వాలంటున్న ఇతర రాష్ట్రాలను ఎట్లా సమాధానపరచగలరన్నది రెండవ వివరణ కావాలి. ఈ రెండింటిపై విధానపరమైన, ఆచరణపరమైన స్పష్టత లేనిదే కాంగ్రెస్ హామీని నమ్మటం ఏ విధంగా ? కాని అటువంటి వివరణ ఏదీ కాంగ్రెస్ పార్టీ నుంచి అవిశ్వాస తీర్మానానికి ముందుగాని, తీర్మానంపై చర్చ సమయంలోగాని లేదు. అటువంటి స్థితిలో వారిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సామాన్యుడుగాని, విజ్ఞులుగాని నమ్మటం ఏ విధంగా? చివరకు టిడిపి అయినా నమ్ముతున్నదా అనేది సందేహాస్పదం. ఈ నేపథ్యంలో, వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత రెండు రోజులకు 24వ తేదీన రాజ్యసభలో, విభజన చట్టం హామీల అమలుపై ప్రత్యేక చర్చ జరిగింది.అపుడు కాంగ్రెస్ పక్షాన ప్రసంగించిన గులామ్ నబీ ఆజాద్ నుంచి కూడా హామీ ఇవ్వాలనే పొడిపొడి మాటతప్ప నిర్దిష్టంగా హామీ వినరాలేదు. దీనిని బట్టి, వచ్చే ఎన్నికలలో ప్రయోజనం కోసం “ఉద్యమం”చేయదలచటం మినహా వారికి స్పష్టతలేదని మరొకసారి అర్థమైంది.
కాంగ్రెస్ వ్యూహంలో మరొక లోపం ఉంది. విభజన చట్టంలోని అంశాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ అమలు కావలసి ఉంది. అందు గురించి రెండు రాష్ట్రాలూ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కాని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్‌పట్ల శ్రద్ధ చూపి, తెలంగాణను పూర్తిగా ఉపేక్షించింది. అది కొట్టవచ్చినట్లు కన్పించిన విషయం. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఎటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఒక జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాలపట్ల సమతులనమైన వైఖరిని తీసుకోవాలి. దానినట్లుంచి రాజకీయంగా విచారించినప్పటికీ, వారు 2019 ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో తమ పరిస్థితి మెరుగుపడాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌పట్ల ప్రత్యేక ప్రేమ చూపటంవల్ల అక్కడ పరిస్థితి మెరుగుపడుతుందేమో జోస్యం చెప్పలేము. కాని తెలంగాణను ఉపేక్షించటం వల్ల అక్కడ మెరుగుపడుతుందా లేక మరింత క్షీణిస్తుందా? పోయినమారు పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసీటు కూడా రాకపోవటం, తెలంగాణాను “ఇచ్చా” మనే పేరుఉన్నప్పటికీ దారుణంగా ఓడటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు హోదా కోసం ఎంత ఉద్యమం చేసినా కొన్ని సీట్లు వస్తే రావచ్చుగాని, ప్రతిపక్ష స్థానాన్ని వైఎస్‌ఆర్‌సిపి బలంగా ఆక్రమించి ఉన్న స్థితిలో పెద్దగా ఆశించగలది ఉండదు. తెలంగాణలో మెజారిటీని ఆశించినా ఆశించకపోయినా కనీసం మరికొన్ని సీట్లతో గౌరవప్రదస్థానాన్ని వారు కోరుకుంటుండాలి. అటువంటి లక్షం తెలంగాణను ఉపేక్షించటం వల్ల నెరవేరుతుందా?
మనం ఒక విచిత్రమైన పరిస్థితిని గతం నుంచే గమనిస్తున్నాము. హోదా గురించి, విభజన హామీల అమలు గురించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షంతోపాటు అన్ని ప్రతిపక్షాలు, పార్టీలకు బయటి ప్రముఖులు, సంస్థలు గొంతెత్తుతున్నాయి. కాని తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలుకు అక్కడి అధికార పక్షం, ప్రభుత్వం పట్టుబడుతుండగా ప్రతిపక్షాలు, బయటి ప్రముఖులుగాని ఇంచుమించు మౌనంగా ఉండటం అర్థంకాని పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టులు, టిడిపిలు ప్రభుత్వాన్ని విమర్శించటమనే తమ బాధ్యతను నెరవేర్చుకోవటం మినహా, తెలంగాణ రాష్ట్రంపట్ల తమ బాధ్యతను పట్టించుకోవటం లేదు. ప్రస్తుతానికి వస్తే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2019 ఎన్నికల దృష్టా ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మాట్లాడిందిగాని, తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా అమలుపరచాలని ఒక్క మాట అయినా అనలేకపోయింది. ఇది ఎటువంటి ఎన్నికల వ్యూహం అవుతుంది? ఈ ప్రశ్నతో ముడిబడి ఉన్న వివిధ అంశాలపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తప్పులు చేసినట్లే ఇపుడు మరొకసారి చేస్తున్నది. ఇప్పటికైనా తమ పొరపాటునుసరిదిద్దుకోగలరేమో చూడాలి.
ఇక ఇతర విషయాలలోకి వెళితే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చలు పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎత్తుగడల పద్ధతిలో సాగాయి తప్ప, గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తించటం, వాటిని సరిదిద్దుకునే ధోరణి చూపటం జరగలేదు. వాస్తవానికి ఆధోరణిని పార్టీ కొత్త అధ్యక్షుడు తమ ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన గత 15 సుదీర్ఘ సంవత్సరాల కాలంలో ఎప్పుడూ చూపలేదు. ఆ విధంగా ఆ వైఫల్యాలు సిద్ధాంతపరంగా, రాజకీయంగా, పార్టీ వ్యవస్థాపరంగా, తాము అధికారంలో గల రాష్ట్రాలలో పరిపాలనా పరంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్క సామాజిక వర్గం, ప్రాంతం కాంగ్రెస్‌కు దూరమవుతూ వస్తున్నాయి. అదే క్రమం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ గుర్తింపు పార్టీ నాయకత్వానికి లేదనలేముగాని, ఆ విషయమై ఏమి చేయాలో వారికి అర్థమవుతున్నట్లు లేదు. అందువల్లనే ఆ కోణాలను స్పృశించకుండా కేవలం ఎన్నికల ఎత్తుగడల చుట్టూ భ్రమణం చేస్తున్నారు.
వర్కింగ్ కమిటీ పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, వ్యవసాయరంగ సంక్షోభం, యువతకు నిరుద్యోగం, అభివృద్ధి మాంద్యం, బడుగు వర్గాల వెనుకబాటుతనం, వారిపై దాడులు, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోవటం, రాజ్యాంగ సంస్థల భంగపాటు, ఈశాన్య రాష్ట్రాల వెనుకబాటు తనం వంటి విషయాలలో కాంగ్రెస్ రికార్డులో ఘనత ఏమీ లేదు. ఆ విషయం దేశానికంతా తెలుసు. ఆ కాలంలో వివిధ వర్గాలు ఆ ప్రశ్నలను లేవనెత్తినపుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దిద్దుబాటు చర్యలు అతిస్వల్పం. చివరలో మన్మోహన్ ప్రభుత్వపు పదేళ్ల హయాంలో (200414) అదే జరిగింది. ఇటువంటి అనుభవాల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల వ్యూహాన్ని గమనించినపుడు ఆశాభావమేమీ కలగటం లేదు.

                                                                                                    ఈ పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ :

                                                                                                      editor@manatelangana.org