కాంగ్రెస్ లో ఎవరికి వారే!

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సీట్లపై ఎవరి అంచనాలు వారివే మహబూబ్‌నగర్ నుంచే ఎర్రశేఖర్ పోటీ? ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి దేవరకద్ర, మఖ్తల్ పోటా పోటీ ఇప్పటి నుంచే జబ్బలు చరుచుకుంటున్న నేతలు మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : కాంగ్రెస్‌లో కుమ్మలాటల రాజకీయాలు జోరందుకున్నాయి. ఒకరిపై ఒకరు అధిష్టానంకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఒకరు ముందుకు పోతే వెనకనే కాళ్లు లాగి కిందికి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు చులకన భావన ఏర్పడుతోంది. వాపును చూసి […]

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
సీట్లపై ఎవరి అంచనాలు వారివే
మహబూబ్‌నగర్ నుంచే ఎర్రశేఖర్ పోటీ?
ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి
దేవరకద్ర, మఖ్తల్ పోటా పోటీ
ఇప్పటి నుంచే జబ్బలు చరుచుకుంటున్న నేతలు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : కాంగ్రెస్‌లో కుమ్మలాటల రాజకీయాలు జోరందుకున్నాయి. ఒకరిపై ఒకరు అధిష్టానంకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఒకరు ముందుకు పోతే వెనకనే కాళ్లు లాగి కిందికి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు చులకన భావన ఏర్పడుతోంది. వాపును చూసి బలపు అనుకుంటున్న కాంగ్రెస్ పెద్దలకు పార్టీ నేతల్లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, ఆదిపత్యాలు కనిపించక పోవడం గమనార్హం. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఆశా వాహులు ఎక్కువగా ఉండడంతో ఏమి చేయాలో ఆ పార్టీకి దిక్కు తోచడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, జడ్చర్ల, మఖ్త ల్ నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కంటికి కునుకు లేకుండా పని చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను తప్పుబట్టడమే ఏకైక ఎజండాగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు తప్ప వారి ఆరోపణల్లో పస లేకుండా పోయంది. ఎన్నికల సమీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో సీట్ల కోసం ఎవరికి వారు పైరవీలు షురూ చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఈ సారి ఎమ్మెల్యే సీటు ఆశించే వారు చాలా మంది ఉన్నారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఒబేదు ల్లా కొత్వాలు, మాజీ డిసిసి అధ్యక్షులు ముత్యాల ప్రకా ష్ ,ఎన్‌పి వెంకటేష్, మాజీ పోలీస్ సురేంద్రరెడ్డి,పోటీలో ఉన్నా రు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకు లభించవచ్చుననే ప్రచా రం జరుగుతోంది. గతం లో టిఆర్‌ఎస్ మాజీ నాయకుడు ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా ఉన్న సయ్యద్ ఇబ్రహీం పేర్లు వినిపిస్తున్నాయి. కులాల సామాజిక వర్గాల వారిగా సీటు కేటాయించే ప్రతిపాదనలో కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ దారెటు ?
మహబూబ్‌నగర్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నియోజకవర్గ అభివృద్దిలో తన ముద్ర వేసుకున్నారు. అనేక అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నారు. అయితే శ్రీనివాస్‌గౌడ్‌కు ధీటైన వ్యక్తిని రంగంలోకి దింపాలన్న ఆలోచన మేరకు కాంగ్రెస్ పెద్దలు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నా రు. కాంగ్రెస్ కు చెందిన ఒక మాజీ మంత్రి తెర వెనుక ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎర్రశేఖర్ జడ్చర్ల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో ఆయన అన్న ఎర్రశేఖర్ అనుచర వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా ఉండడంతో మహబూబ్‌నగర్ నియోజకవర్గంకు ధీటైన అభ్యర్థిగా ఎర్రశేఖర్‌ను రంగంలోకి ప్రయత్నాలు మమ్మురంగా జరగుతున్నాయి. ఎర్రశేఖర్ కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ ఏదైనా మహబూబ్‌నగర్ నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణలు మారబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ నుంచా లేక కాంగ్రెస్, టిడిపి పొత్తు కుదిరితే టిడిపి నుంచా అన్నది సందిగ్దంలో ఉంది. ఏదైనా ఆయన మాత్రం ఈ సారి మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సీట్ల ఖరారులో ఆదిపత్య పోరు :
ఇంకా ఎన్నికలు ఏడాది సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఇప్పటి నుంచే సీట్ల పందారం జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో జిల్లా కాంగ్రెస్‌లో ఆదిపత్య ధోరణి కనిపిస్తోంది. తమ తమ అనుచరవ వర్గాలకు సీట్ల కేటాయింపుకు ఇప్పటి నుంచే పైరవీలు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణలు తమ తమ అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నుంచి సయ్యద్ ఇబ్రహీంను రంగంలోకి దింపేందుకు కేంద్ర మా జీ మంత్రి జైపాల్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో మొ త్తం లక్షా 94 వేల ఓట్లు ఉండగా అందులో మహబూబ్‌నగర్ మండలంలొ 20 వేల ఓట్లు,హన్వాడ మండలంలొ 30 వేల ఓట్లు ఉండగా, మహబూబ్‌నగర్‌లో లక్షా 44 వేల ఓట్లు ఉంటాయని అంచనా ఇందులో ముస్లిం ఓట్లు 50 వేలకు పైగా ఉంటున్న ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సయ్యద్ ఇబ్రహీంను రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. డికె అరుణ మాత్రం తమ అభ్యర్థులను రంగంలోకి దిం పాలని చూస్తున్నారు.ఆలాగే దేవరకద్రలో డికె అరుణ పవన్ కుమార్‌రెడ్డికి మద్దతు ఇస్తుండగా, జైపాల్‌రెడ్డి వర్గం జి మధుసూధన్‌రెడ్డి ( జిఎంఆర్), కాని ప్రదీప్‌కుమార్‌ను రంగంలోకి దింపాలని చూస్తోంది. ఆలాగే మఖ్తల్‌లో కాంగ్రెస్ నుంచి ప్రస్తుత డిసిసిబి చైర్మన్ కె వీరారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉండడంతో ఒక వర్గం ఆయనకు మద్దతు ఇస్తున్నారు. మరో వర్గం శ్రీహరి, నిజాం పాషల కోసం ప్రయత్నిస్తున్నారు.నారాయణ పేటలో టిఆర్‌ఎస్‌లో ఉన్న శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరుతారని మొదట్లో భావించినా ఆ తర్వాత విరమించుకున్నారు.ఆయన కాం గ్రెస్‌కు వస్తే ఆయనకే సీటు ఇచ్చేందుకు ఒకరు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అమ్మకోళ్ల కోసం మరో వర్గం ప్రయత్నిస్తున్నారు. జడ్చర్లలో మల్లురవికే దక్కనుందని ప్రచారం సాగుతోంది. సీట్ల ఎంపికలో ఎవరికి వారు ప్రయత్నిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఎన్నికలు సమీస్తున్న సందర్భంగా సీట్ల లొల్లితో ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు.

Related Stories: