కాంగ్రెస్ నేతలపై గుత్తా మండిపాటు

నల్లగొండ : కాంగ్రెస్ నేతలపై ఎంపి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని , అవివేకంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీగా తయారైందని, సిఎం కెసిఆర్‌ను, తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని […]

నల్లగొండ : కాంగ్రెస్ నేతలపై ఎంపి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని , అవివేకంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీగా తయారైందని, సిఎం కెసిఆర్‌ను, తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Gutta Comments on Congress Leaders

Related Stories: