కాంగ్రెస్‌ పార్టీతో పెళ్లైంది..!

హైదరాబాద్‌: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్‌ పర్యటనలో రాహుల్‌ రెండో రోజూ బిజీబిజీగా గడిపారు. మంగళవారం ఉదయం మీడియా ఎడిటర్ల సమావేశంలో తన పెళ్లిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు రాహుల్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీతో తన వివాహం జరిగిపోయిందని చమత్కరించారు. అలాగే మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. 2019లో మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవని, ఆయన కేవలం ఊహల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపికి 230 సీట్లు […]

హైదరాబాద్‌: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్‌ పర్యటనలో రాహుల్‌ రెండో రోజూ బిజీబిజీగా గడిపారు. మంగళవారం ఉదయం మీడియా ఎడిటర్ల సమావేశంలో తన పెళ్లిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు రాహుల్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీతో తన వివాహం జరిగిపోయిందని చమత్కరించారు. అలాగే మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. 2019లో మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవని, ఆయన కేవలం ఊహల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపికి 230 సీట్లు రాకుంటే మోడీ ప్రధాని కాలేరన్నారు. ఆ సందర్భంలో కమలం మరొకరని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశం అనంతరం తాజ్ కృష్ణలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు.

Comments

comments

Related Stories: