కాంగ్రెస్‌ను స్థానిక ఎన్నికల్లో బలోపేతం చేస్తాం: ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి

Congress will be strengthened in local elections

మన తెలంగాణ/వనపర్తి రూరల్ : కాంగ్రెస్ పార్టీని  స్థానిక ఎన్నికల్లో బలోపేతం చేయాలని నాయకులు,కార్యకర్తలకు ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి పిలుపునిచ్చా రు. వనపర్తి మండల పరిధిలోని కడుకుంట్ల గ్రామంలో కాంగ్రెస్ యూత్ కమిటీ లను,మహిళా కమిటీలను, రైతు కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధితోనే కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. గ్రా మాల అభివృద్ధికి కాంగ్రెస్‌నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్ల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మిషన్ భగీర థ ద్వారా పైపులైన్ మరమ్మత్తులను వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకునేందుకు అధికారు లతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. వాటర్ ట్యాంక్ నిర్మాణాలను నాణ్యవంతంగా నిర్మిం చిందేకు పనుల్లో నాణ్యత ఉండేందుకు అధికారులు పర్యవే క్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఎన్నుకున్నారు. యూత్ కమిటి అధ్యక్షులు రాములు గౌడ్, ప్రధానకార్యదర్శిగంగారం, కోశాధికారి నరేష్,క్రాంతికుమార్, మహిళా కమిటి అధ్యక్షులు వెంకటమ్మ, ప్రధానకార్యదర్శి గోవిందమ్మ, కోశాధికారి శాంతమ్మ, ఇంది రమ్మలను ఏకగ్రీవంగా ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి సమక్షంలో ఎన్నుకున్నారు. కార్యక్రమం లో డిసిసి ప్రధానకార్యదర్శి తిరుపతయ్య, మండల అధ్యక్షులు వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ మాధవి,గోవదర్ధన్, ప్రధాన కార్యదర్శి రవికిరణ్ , కిరణ్‌కుమార్, చీర్ల సత్యం, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments