కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి

Damodara Raja Narasimha Speech About Congress Party

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : రాష్ట్రంలో అధ్వా న్న పాలన కొనసాగుతోందని, ప్రజా సమస్యలు పరిష్కా రం కావడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ సమావేశం ఆదివారం సంగారెడ్డిలో జరిగింది. రాష్ట్ర పరిశీలకులు బోస్‌రాజు, శ్రీనివాస కృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రాజనర్సింహా మాట్లాడుతూ కేం ద్రం నుంచి రాష్ట్రానికి సాయం పొందడంలో విఫలమ య్యారన్నారు. ఒక సారి సిఎం కెసిఆర్, ఇంకో సారి ఆయన కుమారుడు మంత్రి కెటిఆర్‌లు ప్రధాని మోడిని కలిసి వస్తున్నారన్నారు. కానీ, వారు ఏం మాట్లాడుతున్నారో… రాష్ట్రానికి ఏం తెస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మైనార్టీలకు 12 శాత రిజర్వేషన్‌పై కూడా వారు నోరు మెద పడం లేదన్నారు. తమ సొంత పనుల గురించి కలుస్తున్నారా? ఇతర అవసరా గురించి కలుస్తున్నారా? ప్రజలకు తండ్రీ కొడుకులు వివరించా ల్సిన అవసరం ఉందన్నారు. మాజీ విప్ జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలు టిఆర్‌ఎస్ పాలనపై విసుగు చెందారని, తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారెడ్డి మాట్లా డుతూ ప్రతి కార్యకర్త సైనికుడి లాగా పని చేస్తేనే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. పరిశీలకులు మాట్లాడుతూ సోషల్ మీడియాను కార్యకర్త లు బాగా వాడుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలన్నారు. పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, సురేష్‌షెట్కార్, సంజీవరెడ్డి, ఫహీం, తోపాజీ అనంతకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments