కాంగ్రెస్‌కు షాక్

మన తెలంగాణ/సిటీబ్యూరో ‘కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికి స్థాపించిన తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాయకులు చేతులు కలపడం దారుణం’ అంటూ నాయకులు ఆ పార్టీని వీడుతుండటంతో గ్రేటర్‌లో కాంగ్రెస్‌ కు షాక్‌మీద షాక్ తగులుతోంది. అసలే గత ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గానికి కూడా ప్రాతినిథ్యం లేక ఇంతకాలం చతికిలపడిన ఆ పార్టీకి గ్రే టర్‌లో కోలుకోలేని విధంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి. టిడిపితో పొత్తు ఖరారవ్వగానే ఎంతమంది నాయకులు జంపింగ్ చేస్తారోననేది రాజకీయ పార్టీలు ఆసక్తిగా […]

మన తెలంగాణ/సిటీబ్యూరో
‘కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికి స్థాపించిన తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాయకులు చేతులు కలపడం దారుణం’ అంటూ నాయకులు ఆ పార్టీని వీడుతుండటంతో గ్రేటర్‌లో కాంగ్రెస్‌ కు షాక్‌మీద షాక్ తగులుతోంది. అసలే గత ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గానికి కూడా ప్రాతినిథ్యం లేక ఇంతకాలం చతికిలపడిన ఆ పార్టీకి గ్రే టర్‌లో కోలుకోలేని విధంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి. టిడిపితో పొత్తు ఖరారవ్వగానే ఎంతమంది నాయకులు జంపింగ్ చేస్తారోననేది రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా శివారులో బలమైన నాయకుడిగా పేరున్న, గత అ సెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బండారి లకా్ష్మరెడ్డి పార్టీని వీడటం దాదాపు ఖాయమైంది. ఈయన బాటలోనే మరికొందరు గ్రేటర్ నాయకులున్నారనే ప్ర చారం బలంగా సాగుతోంది. ప్రస్తుతం నాయకులంతా పొత్తులో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందో తేలే వరకు ఆశావహులు వేచి చూస్తారన్నది బహిరంగ రహస్యం.
అధికార టిఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవడమే ధ్యే యంగా పొత్తులు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా టిడిపి, కాంగ్రెస్‌లు కలవడంపై సర్వత్రా పెదవి విరుపులు మొదలయ్యాయి. ఓవైపు టిఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడి కావడంతో పాటు వారు నియోజకవర్గాల్లో అంతర్లీనంగా, బహిరంగ ప్రచారాన్ని ఆర్భాటంగా సాగిస్తున్నారు. మరో వైపు టిడిపి, కాంగ్రెస్‌ల సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో ప్రచారం చేసుకోవాలా..? వద్దా..? అనే డైలమాలో కాంగ్రెస్, టిడిపి నాయకులున్నారు. ప్రచారం చేసుకుంటున్న తరుణంలో టిక్కెట్టు వేరే పార్టీకి వెళ్ళితే పరిస్థితి ఏమిటి..? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ నాయకులున్నారు. బలంగా టిక్కెట్టు ఆశిస్తున్నవారున్న కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఎల్‌బినగర్, సనత్‌నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో ప్రచారానికి శ్రీకారం జరగలేదు. టిడిపి మాత్రం కచ్చితంగా ఉప్పల్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, సనత్‌నగర్, కూకట్‌పల్లిలను అడిగే అవకాశాలు అధికంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నాయకులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

జంపింగ్‌కు రెడీ
ఇదిలా ఉండగానే కొందరు తమకు టిక్కెటు రానిపక్షంలో కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధ్దమవుతున్నారు. గత ఐదేళ్ళుగా పార్టీకి పనిచేస్తున్నా తమకు తగిన గుర్తింపునివ్వనప్పుడు ఈ పార్టీలో ఉండటం కన్నా మరో మార్గం ఆలోచించుకోవాలనే యోచన చేస్తున్నట్టు గ్రేటర్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ముఖ్యంగా గతంలో మంత్రిగా పనిచేసిన నాయకుడు కూడా పార్టీని వీడే అవకాశాలు అధికంగా ఉన్నట్టు చర్చకు తెరలేచింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా జంపింగ్‌కు సిద్ధ్దమవుతున్నట్టు కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. పొత్తులు తేలిన అనంతరం ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అధికార పార్టీలోకి చేరేందుకు ముందుగానే చర్చలు జరుపుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. మరి పొత్తు తేలితే ఎంతమంది వీడుతారో వేచి చూడాలి.

Comments

comments